ఇండియా కూటమి అభ్యర్థిగా వామపక్షాలు బలపరిచిన మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపుతోనే ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.

భద్రాచలం నేటి ధాత్రి

పోరిక బలరాం నాయక్ భారీ మెజారిటీతో మెజారిటీతో గెలవబోతున్నారు

భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు

మతోన్మాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ బిజెపి,మతోన్మాద పార్టీలకు మన్యంలో మనుగడలేదు

సిపిఎం పార్టీ భద్రాచలం నియోజకవర్గం కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు

భావితరాల దేశ పౌరులు ప్రశాంతమైన జీవితం కొనసాగించాలి అంటే దేశంలో బిజెపి పార్టీని తరిమికొట్టాలి

సిపిఐ నాయకులు రావులపల్లి రవికుమార్

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచలం నియోజకవర్గ కేంద్రం భద్రాచలం పట్టణంలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ ఉమ్మడి ప్రచారం మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఎన్నికల ప్రచారం స్థానిక జగదీష్ కాలనీలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఎన్నికల ప్రచారంలో స్థానిక భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని ప్రజలతో మాట్లాడుతూ

గత పది ఏళ్లలో ఎంపీలుగా ఉన్న ఇద్దరు కూడా భద్రాచల నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోకుండా, చుట్టం చూపుగా ఇక్కడికి వస్తూ పోతూ ఉండేవారని,అలాంటి బాధ్యత లేని వారికి ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని.

మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల బరిలో వామపక్షాలు మిత్రపక్ష ఇండియా కూటమి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు వస్తున్నటువంటి పోరిక బలరాం నాయక్ గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు భద్రాచలం నియోజకవర్గం లో కేంద్రం ద్వారా నిధులు తీసుకువచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగిందని.

ప్రజలందరూ కూడా మన కోసం పనిచేసి, మన ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడిపించగల సత్తా ఉన్న నాయకుడు బలరాం నాయక్ ని ఈనెల 13వ తారీకున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జీవీఎం ప్యాడ్ పై నాలుగో నెంబర్ లో ఉన్న హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను ఆయన కోరారు.

ప్రచారంలో భాగంగా సిపిఎం నియోజకవర్గ కన్వీనర్ మచ్చ వెంకటేశ్వర్లు ప్రజలతో మాట్లాడుతూ

మత రాజకీయాలకు కేంద్ర బిందువు అయినటువంటి బిజెపి పార్టీకి మన్యంలో మనుగడలేదని, కేవలం మతవిద్వేషాలను రెచ్చగొడుతూ, రాజకీయ స్వాలభం కోసం మతాల పరంగా ప్రజల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయం చేసే వారికి కాలం చెల్లిందనీ, రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ బలపరిచిన ఇండియా కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి బలరాం నాయక్ కి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నామని, నియోజకవర్గ ప్రజలందరూ కూడా బలరాం నాయక్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రచారంలో భాగంగా సిపిఐ నాయకులు రావులపల్లి రవికుమార్ ప్రజలతో మాట్లాడుతూ

పదేళ్లపాటు అధికారంలో ఉన్న బిజెపి మత విద్దేశాలను రెచ్చగొడుతూ,హింసాత్మక పాలనను కొనసాగిస్తూ, స్త్రీలపై అఘాయిత్యాలను కొనసాగిస్తూ పాలన చేస్తున్నారే తప్ప, ప్రజా రంజక పాలన గురించి, యువతకు ఉద్యోగా కల్పన గురించి ఏ రోజు కూడా కేంద్రంలో ఉన్న బిజెపి ఆలోచన చేయలేకపోయిందని.

బిజెపి మూడవసారి దేశంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారని, ఇలాంటి వికృత పాలన కొనసాగించే బిజెపిని మూడవసారి అధికారంలోకి రాకుండా చేసేందుకే దేశ ప్రజల శ్రేయస్సు కోరుతూ , దేశ సమగ్రతను కాపాడేందుకు ఇండియా కూటం ఏర్పాటు చేయటం జరిగిందని.

సిపిఐ పార్టీ బలపరిచిన ఇండియా కూటమి అభ్యర్థిగా పోరిక బలరాం నాయక్ ని రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈవీఎం ప్యాడ్ పై నాలుగో నెంబర్ సీరియల్ లో ఉన్న హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆయన పార్లమెంటుకు పంపాలని ప్రజలకు వివరించారు.

ఎన్నికల ప్రచారంలో.

సిపిఎం నాయకులు బాల నర్సారెడ్డి బండారు శరత్ గారు,సిపిఐ నాయకులు నాయుడు రామారావు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రాసమల్ల రాము, అన్నెం రామిరెడ్డి,దుద్దుకూరు సాయిబాబా,తాండ్ర నరసింహారావు, ఇందుల రమేష్, మహిళా కాంగ్రెస్ నాయకులు తుమ్మల రాణి, కట్ట కళ్యాణి,రూప దేవి, పద్మప్రియ , కాంగ్రెస్, సిపిఎం,సిపిఐ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!