పేదల అభ్యున్నతే… కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.
#ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన మాలోతు చరణ్ సింగ్.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మాలోతు చరణ్ సింగ్ అన్నారు. శుక్రవారం మండలంలోని బొల్లోని పల్లి గ్రామంలో పోలు దాసరి భద్రయ్య నిర్మల దంపతులు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ మేరకు చరణ్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలలు సాకారం చేసే దిశగా ముందుకు సాగుతుందని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా అద్దె ఇండ్లలో, తాత్కాలిక గుడిసెలో జీవిస్తున్న సామాన్య ప్రజలకు ఈ పథకం ఆశా కిరణంగా మారిందన్నారు. ప్రతి కుటుంబానికి గౌరవ ప్రధానమైన నివాసం కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకుందన్నారు. ప్రతి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియను వేగమంతం చేసే విధంగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చిట్యాల తిరుపతిరెడ్డి, సర్పంచ్ సిద్ధ సంతోష్, ఉప సర్పంచ్ బోళ్ల సర్వేశం, నాయకులు జిల్లా మునిందర్, కుసుంబ రఘుపతి, బత్తిని మల్లయ్య, జెట్టి రామ్మూర్తి, మోహన్, సురేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
