మహాదేవపూర్- నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలని టి యు ఎఫ్ స్థానిక ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలను అందజేసింది. మంగళవారం రోజు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల కు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపును ఇచ్చి, స్వతంత్ర సమరయోధులుగా కార్డులను జారీ చేయాలని, స్థానిక ఎంపీపీ రాణి బాయ్, జిల్లా పరిషత్ సభ్యురాలు గుడాల అరుణ కు వినతి పత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆయ్యుబ్ ఉద్దీన్, కలికూట దేవేందర్ ఆన్కారీ ప్రభాకర్ అక్రముద్దీన్ పిడుగు సమ్మయ్య రహమత్ ఖాన్ జనగామ పోచం కేదారి ప్రవీణ్ కుమార్ పూత రమేష్, తోపాటు తదితరులు ఉన్నారు.