
ఏవైఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య డిమాండ్
భూపాలపల్లి నేటిధాత్రి
సోమవారం జయశంకర్ జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు అరకొండ రాజయ్య అద్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏవైఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య, ఎమ్మార్పీఎస్ టిఎస్ జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య లు హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులపై మహిళలపై రోజు రోజుకు పెరిగి పోతున్న సంఘటనలు అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయని అన్నారు. అందుకే దళిత బహుజనులు అందరూ ఏకమై బహుజనులపై దాడిని ఖండించాలి దళితులపై దాడులు చేస్తున్న నిందితులను కఠినంగా శిక్షించక పోవడం వలన ఇటీవల వికారాబాద్ జిల్లా యాలాల మండలం ఎనికేపల్లి గ్రామ దళితుడు నట్టల మనోహర్ ని ఇదే గ్రామానికి చెందిన ఇతర కులస్తులు బిటి రాజేందర్ మహేందర్ భాస్కర్ బాలరాజు రాము, శ్రీనివాస్ లు కిడ్నాప్ చేసి కట్టేసి ఇనుప రాడ్ తో కట్టెలతో మనోహర్ ని కొట్టి చంపడానికి ప్రయత్నం చేయడం సిగ్గు చేటన్నారు. దళితుడిని కిడ్నాప్ చేసి హత్యాయత్నం చేసిన నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తో పాటు హత్య యత్నం కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని అన్నారు. అందుకే గ్రామ స్థాయి నుంచి కుల మతాలకు అతీతంగా అందరినీ చైతన్య వంతులను చేయాలని మహానీయుల ఆశయాలను సిద్ధాంతాలను కొనసాగింప చేయాలని కోరారు.
ఈ సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మారపెల్లి కొంరయ్య జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ మండల ఉపాధ్యక్షులు మాడుగుల వీరయ్య , పారనంది రాములు మండల నాయకులు కోండ్ర సారయ్య అరకొండ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.