ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి రాజు
భూపాలపల్లి నేటిధాత్రి
ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కార్తీక్ పై ఏబీవీపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజ్ కుమార్
కూకట్ పల్లి జెఎన్టీయుహెచ్ లో విద్యార్థులు సమస్యలు తెలుకోవడానికి ఎస్ఎఫ్ఐ బృందం వెళ్ళింది. విద్యార్ధులతో మాట్లాడి వస్తున్న సందర్భంలో ఎస్ఎఫ్ఐ నాయకులతో ఎబివిపి నాయకులు దిలీప్ మరియు కోంతమంది ఘర్షణకు దిగ్గారు. ఈ సందర్భంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కార్తీక్ పై బూతులు తిడుతూ12 మంది ఎబివిపి నాయకులు దాడిచేసి చోక్కా చించి గాయపరిచారు. ఈ చర్యలను ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. గతకాలంగా జెఎన్టీయుహెచ్ లో ఎబివిపి ఆరాచకాలకు పాల్పడుతుంది. విద్యార్ధుల సమస్యలు పరిష్కారం కోసం పోరాడుతున్న ఎస్ఎఫ్ఐ పై ఓర్వలేక దాడులు చేస్తోంది. గతంలో సంగారెడ్డి, కరీంనగర్, మహాబుబ్ నగర్ జిల్లాలో దాడులు పాల్పడ్డారు.విద్యార్థులలో నికరంగా పోరాడుతున్న ఎస్ఎఫ్ఐ ఎదుగుదల ఓర్వలేక భౌతికంగా దాడులు చేస్తున్నారు. నిజంగా ఎబివిపి చిత్తశుద్ధి ఉంటే విద్యార్థులు సమస్యలపై పోరాడాలని భౌతికంగా దాడులు చేస్తే సహించమని తెలిపారు. ఈ దాడులను ఇకనైనా దాడుల సంస్కృతి ఎబివిపి మానుకోవాలి లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపారు.