రంగులమయంగా 145 వ నగర సంకీర్తన.
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని పెద్దమ్మ తల్లి ఆలయ పరిసర ప్రాంతంలో ఆదివారం జరిగిన 145 వ నగర సంకీర్తన రంగులమయంగా జరిగింది. అత్యంత వైభవంగా కొనసాగిన సంకీర్తన కార్యక్రమంలో భక్తులు శ్రీ కృష్ణ కీర్తనలు ఆలపిస్తూ శోభయాత్ర జరిపారు. చిన్నారులు, మహిళలతో పాటు పెద్ద ఎత్తున భక్తులు శ్రీ కృష్ణ గీతాలకు నృత్యాలు చేస్తూ ఆనంద పరవశంలో మునిగితేలారు.