ఆ రామయ్య మా ఇళ్లకు పవిత్రమైన అక్షింతలను

చేరవేశాడు: కట్ట నర్సింగరావు, కొల్లా శంకర్ రావు

కూకట్పల్లి జనవరి 5 నేటి ధాత్రి ఇన్చార్జి

అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్ట్ ఆదేశా నుసారం కెపిహె చ్బి కాలనీ శ్రీ వెంకటేశ్వర బస్తి ఆధ్వ ర్యంలో గడప గడపకు అయోధ్య రాముల వారి అక్షితల వితరణ కార్యక్రమములో భాగంగా ఈరోజు 3వ ఫేస్ ఎల్ఐజి ఫ్లాట్స్ 47వ బ్లాక్ నెంబర్ దగ్గర నుంచి 69వ బ్లాక్ నెంబర్ వరకు ఎం ఐ జి ప్లాట్స్ 48వ బ్లాక్ నుంచి 57వ బ్లాక్
వరకు ప్రతి ఇంటికి వెళ్ళి అయోధ్య రాముల వారి అక్షితలను 336 గడ పలకు పంపిణీ చేయడం జరిగిన ది.ఈ సందర్భముగా తెలంగాణ హిందూ సేవా సమితి అధ్యక్షులు కట్టా నరసింగరావు మాట్లాడుతూ హిందూ సంస్కృతి సాంప్రదాయా లను పాటిస్తూ ప్రతి ఒక్కరూ రామ భక్తులను సంతోషంగా తమ ఇళ్లకు ఆహ్వానిస్తున్నారని,ఆ రామయ్యే మా ఇళ్లకు ఈ రామ భక్తుల ద్వారా పవిత్రమైన అక్షితలు చేరవేశారని సంతోషాన్ని వ్యక్తపరిచారన్నారు.
ఈ కార్యక్రమములో పచ్చమట్ల వెంకట సత్తిరాజు,ఏనూతుల మహేష్, ఎస్ రఘురామ్,కొల్లా శంకర్,మాటూరి వరలక్ష్మి,సుజాత, ఐ.రమాదేవి,విజయ కోటేశ్వరి,మం జూష,స్వాతి,గీత,శాంత,రేణుక,
నాగలక్ష్మి,లక్ష్మి,సుప్రియ,పద్మ, తది తరులు పాల్గొన్నారు.
ఫోటో నెంబర్ 3లో…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!