దటీజ్‌ ‘‘కేసిఆర్‌’’ పవర్‌.

https://epaper.netidhatri.com/view/252/netidhathri-e-paper-3rd-may-2024%09/2

‘‘కేసిఆర్‌’’ రాక…ఆ రెండు పార్టీలకు కాక!

`ఎండా కాలంలో ఆ రెండు పార్టీలకు చలి జ్వరం!

`కేసీఆర్‌ రాకతో పట్టుకున్న భయం!

`కేసీఆర్‌ ఉక్కపోతను భరించలేని ధైన్యం!

`తమ ఉనికి ప్రశ్నార్థకమని రెండు పార్టీల ఆగమాగం!

`ఈసీతో నోటీసులకు ఒక్కటైన రాజకీయ విజాతి ద్వయం.

`సందిట్లో సీమాంధ్ర మీడియా సడే మియా!

`తెలంగాణ మీద సీమాంధ్ర మీడియా అక్కసు!

`తెలంగాణపై మళ్ళీ పచ్చ మీడియా చిచ్చు?

`తెలంగాణ రాజకీయాలలో అస్థిరతే ఉచ్చు?

`ఎన్నికల సంఘం అత్యుత్సాహం?

`కేసీఆర్‌ ప్రచారంపై నిషేదం!

`ఓ కులాన్ని కించపర్చిన వ్యక్తి అసభ్యతపై కేసిఆర్‌ ప్రశ్నస్తే తప్పా?

`సీఎం. రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సబబా?

`మళ్లీ పచ్చ మీడియా పిచ్చి వేషాలు?

`కేసీఆర్‌ భాష మీద అవాకులు చెవాకులు?

`తెలంగాణలో ప్రీ పోల్‌ సర్వేల పేరుతో మభ్యపెట్టడాలు?

`ఇంత కాలం ముఖం లేని వాళ్లు కూడా వస్తున్నారు?

`తమ రాజకీయ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు?

`బీఆర్‌ఎస్‌ బలపడడం వారికి ఇష్టం లేదు?

-బీఆర్‌ఎస్‌ పుంజుకుంటే వారి పప్పులుడకవు?

-ఇంత కాలం కలుగులో దాక్కున్న ఎలుకలు కూడా తోకలెత్తుతున్నాయి?

-తెలంగాణ ప్రజల చైతన్యం ఒక ప్రభంజనం.. దానికి కేసీఆర్‌ రాజకీయం తోడైతే విశ్వరూపం.

-నమ్మించి మోసం చేసిన వారికి ఈ ఎన్నికలలో తప్పదు గుణపాఠం!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

సింహం శ్వాస, గర్జన భయంకరమైనవి. కేసిఆర్‌ సింహ గర్జన ఎవరూ తట్టుకోలేనిది. కేసిఆర్‌ రాకతో జాతీయ పార్టీల శిబిరాలు కకావికలమౌతున్నాయి. ఊపిరాడకుండా పోతున్నాయి. ఎండా కాలంలో కూడా కేసిఆర్‌ను చూస్తే కాంగ్రెస్‌, బిజేపిలకు చలి జ్వరం వస్తోంది. ఇది బిఆర్‌ఎస్‌ శ్రేణులు అంటున్న మాట. ఒక్కసారి కేసిఆర్‌ రంగంలోకి దిగిన తర్వాత ఇతర పార్టీలకు తావుండదు. తెలంగాణ రాజకీయాల్లో చోటుండదు. నిజం చెప్పాలంటే కేసిఆర్‌ మాటలకు ఎప్పుడూ పదునెక్కువ. కేసిఆర్‌ చెప్పే మాటలుకు తెలంగాణ ప్రజల్లో క్రేజ్‌ ఎక్కువ. ఒక్కసారి కేసిఆర్‌ కనిపిస్తే చాలు… ఆయన మాట వినిపిస్తే చాలు అనుకునేవారు చాలా మంది వున్నారు. అది తెలంగాణలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ తెలుగువాళ్లునా, అక్కడ కేసిఆర్‌ మాట్లాడుతుంటే వింటుంటారు. ఆయన మాటలను ఎంతో ఇష్టపడతారు. ఆయన చెప్పే మాటలు సావదానంగా వింటారు. ఆయన వాడే పంచాంగమంతా గ్రాంధికంలోనే వుంటుంది. కాని అవి ఊర మాస్‌కు కూడా మంచి కిక్కిస్తాయి. అందుకే ఆ మాటలను తట్టుకోలేక రాజకీయ పార్టీలు విలవిలలాడుతుంటాయి. నాయకులు కలవరపడుతుంటారు. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. ఎప్పుడో ఎప్రిప్‌ 5న కేసిఆర్‌ సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌, బిజేపిలు ఎన్నికల కమీషన్‌కు పిర్యాధు చేశాయి. ముందూ వెనుక ఆలోచించుకోకుండా ఎన్నికల కమీషన్‌ 48 గంటల పాటు కేసిఆర్‌ ప్రచారం చేయొద్దని నోటీసులిచ్చింది. ఇది ఒక రకంగా కేసిఆర్‌కు ఎంతో మేలు చేసే అంశమే. అసలు తెలంగాణలో రాజకీయ ముఖచిత్రమేమిటో పూర్తిగా తెలుసుకునే అవకాశం ఏర్పడిరది. ఎక్కడెక్కడ పార్టీకి కేసిఆర్‌ అవసరం ఎక్కువ వుంటుందో కూడా తెలుస్తుంది. తెలంగాణ ప్రజలకు కేసిఆర్‌ ఒక బలమే కాదు, బలహీనత కూడా…ఎందుకంటే కేసిఆర్‌ మాటలు వినికుండా తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం వుండలేదు. కేసిఆర్‌ను చూడకుండా ఎక్కువ కాలం ఓపిక పట్టలేరు. అందుకే కేసిఆర్‌ ప్రజల్లోకి వస్తున్నాడంటే ప్రజలు తండోపతండాలు వస్తున్నారు. చీమల దండులాగా రోడ్ల నిండా నిండుతున్నారు. కేసిఆర్‌ బస్సుయాత్ర సాగుతున్న ప్రాంతాలను చుట్టు ముడుతున్నారు. ఎక్కడికక్కడ స్వచ్చందంగా జనం కేసిఆర్‌ ను చూడాలని వస్తున్నారు. ఆయన మాటలు వినాలని మండుటెండలను సైతం లెక్క చేయడంలేదు. ఆయన కోసం గంటలు గంటలు ఎదురు చూస్తున్నారు. కేసిఆర్‌ రోడ్‌ షోల వెంట పరుగులు తీస్తున్నారు. నాలుగు కూడళ్లలోసభలు పెడితే, చెట్లెక్కి కూర్చుంటున్నారు. ఇండ్లపైకెక్కి చూస్తున్నారు. కేసిఆర్‌ను చూసి పరవశంతో ఊగిపోతున్నారు. కేసిఆర్‌ మళ్లీ రావాలని ఆగకుండా నినాదాలు చేస్తున్నారు. కేసిఆర్‌కు కొండంత బలాన్నిస్తున్నారు. ఇది చూసిన కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి. బిజేపికి కాళ్లూ చేతులు వణుకుతున్నాయి. ఏం చేయాలో పాలుపోకుండా కేసిఆర్‌ మీద పిర్యాధు చేశాయి. ఒక్కగంటైనా సరే కేసిఆర్‌ మాట వినపడకుండా చేస్తే ప్రజలు మా గురించి ఆలోచిస్తారేమో? అన్న ఆశతో కాంగ్రెస్‌,బిజేపిలున్నాయి. అంతగా ప్రజలను ప్రభావితం చేస్తున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌.
పార్లమెంటు ఎన్నికలను కేసిఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాడని కాంగ్రెస్‌, బిజేపిలు ఊహించలేదు.
బిఆర్‌ఎస్‌ నాయకులను లాక్కుంటే కేసిఆర్‌ డైలమాలో పడతాడనుకున్నారు. కేసిఆర్‌ను డిఫెన్స్‌లో పడేసి, తేరుకునే లోపు దెబ్బ కొట్టాలని కాంగ్రెస్‌, బిజేపిలు చూశాయి. కాని కేసిఆర్‌ ఛరిష్మా ముందు ఎలాంటి కుప్పిగంతులు పనిచేయవని కాంగ్రెస్‌, బిజేపిలు తెలుసుకోలేకపోయాయి. ఇప్పుడేం చేయాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నాయి. గత కొంత కాలం క్రితం వరకు అటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇటు బిజేపి నేతలు కేసిఆర్‌ను రా..రమ్మంటూ పిలిచాయి. కేసిఆర్‌ అసెంబ్లీకి రావడంలేదు. ప్రజలకు కనిపించడం లేదు. టివిల్లో కూర్చుంటున్నాడు? అంటూ ఏద్దేవా చేశాయి. కేసిఆర్‌ మౌనం కూడా ఒక ప్రళయం లాంటిదని నేటిధాత్రి గతంలోనే చెప్పింది. కేసిఆర్‌ మౌనంగా వున్నారంటే రాజకీయ సునామీ సృష్టించినట్లే అన్నది నేటి ధాత్రి స్పష్టంగా చెప్పింది. అయినా కాంగ్రెస్‌, బిజేపిలు రెచ్చగొట్టాయి. ఇప్పుడు ఆయన బైటకొస్తే తట్టుకోలేకపోతున్నాయి. కేసిఆర్‌ చాణక్యం తెలిసినా, ఆయనను తక్కువ అంచనా వేశారు. ఓడిపోయిన తర్వాత కేసిఆర్‌ అంతర్మధనంలో వుంటారు. జనంలోకి రావాలంటే ఇబ్బందిపడతారు. ఆయనకు ఆత్మాభిమానం ఎక్కువ. అందుకే బైటకు రాకపోవచ్చు..అంటూ ఏదేదో ఊహించుకున్నారు. నిజానికి తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకే కేసిఆర్‌. అలాంటప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ వుంటాడా? సమస్యలు ఎదుర్కొంటుంటే నాకెందుకులే అనుకుంటాడా? మంచినీటికి సైతం విలవిలలాడుతుంటే కేసిఆర్‌ మౌనంగా వుండగలరా? బైటకు వచ్చి గర్జించకుండా వుంటారా? ఆ మాత్రం అవగాహన లేకుండా కాంగ్రెస్‌, బిజేపిలు అనవసరంగా కేసిఆర్‌ను ఉచ్చులోకి లాగుతున్నామనుకున్నాయి. కాని పద్మవ్యూహంలో ఆ పార్టీలే చిక్కుకుంటాయని ఊహించలేపోయాయి. కేసిఆర్‌ రేపే సుడిగుండాలు, కాంగ్రెస్‌, బిజేపిల రాజకీయ పునాదుల పెలికిస్తాయని అనుకోలేదు.
ఇదిలా వుంటే కేసిఆర్‌ బైటకు వస్తే ఎలాంటి రాజకీయ సునామీ వస్తుందో..అందరికీ తెలుసు.
ఎక్కడ మత మనుగడ ప్రశ్నార్ధకమౌతుందో అని ఆందోళనలో పచ్చ ఛానళ్లు కేసిఆర్‌ మీద విషాన్ని చిమ్ముతున్నాయి. అసలు కేసిఆర్‌ రోడ్‌ షోలకు జనమే రావడం లేదంటూ సొల్లు పురాణాలు వల్లిస్తున్నాయి. దానికి తోడు పదేళ్లగా మీడియా ముందుకు రావడానికి జంకిన ఓ మీడియా వ్యాపార వేత్త బాస్‌ఈస్‌ బ్యాక్‌ అని తెరమీద వచ్చాడు. తెలంగాణ బాస్‌ కేసిఆర్‌ మీద విషం చిమ్మే ఎత్తుగడ వేశాడు. ఓ వైపు ఆంధ్ర ప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు కలిసి జరుగుతుంటే అక్కడి ఎన్నికల మీద పట్టింపు లేదు. కాని ఆ వ్యక్తికి తెలంగాణ మీద పుటుక్కున ఆసక్తి పుట్టుకొచ్చింది. తెలంగాణలో సర్వే పేరుతో జాతీయ పార్టీలకు భజన చేసేందుకు వచ్చాడు. తన వెనుకటి బుద్ది చూపించుకున్నాడు. తెలంగాణలో రైతు సమస్యలు పట్టలేదు. రైతులకు ఈ సారి సరిగ్గా నీళ్లందలేదు. తెలంగాణ భూగర్భ జాలాలు ఎండిపోయాయి. పదేళ్లపాటు రెప్పపాటు కరంటును అనుభవించాడు. ఇప్పుడు మళ్లీ కరంటు కోతలు చూస్తున్నాడు. కాని దానిపై వార్తలు ప్రసారం చేయడానికి వెనుకాడుతున్నాడు. ప్రజలు ఉక్కపోతలను భరించేందుకు సిద్దంగా వుందనుకున్నాడో ఏమో! కరంటు కోతలను ప్రజలు స్వీకరిస్తున్నట్లుగా సీమాంద్ర మీడియా పైత్యం కనిపిస్తోంది. అందుకే తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ పార్టీలకు అనుకూలమంటూ వాళ్లు వేసుకున్న లెక్కలు చెబతున్నారు. జనం వేసుకుంటున్న లెక్కలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓ వైపు కేసిఆర్‌ బస్సు యాత్ర ప్రభంజనంలా సాగుతోంది. జనమంతా కేసిఆర్‌ను కీర్తిస్తున్నారు. పదేళ్ల కాలాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఐదునెలల్లోనే యాభై ఏళ్లు గోస కాంగ్రెస్‌ చూపిస్తుందని పల్లెల్లో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇవి మాత్రం సీమాంద్ర మీడియాకు కనిపించడం లేదు.
కాంగ్రెస్‌ పార్టీ నోటికొచ్చినట్లు చెప్పిన అబద్దాలను చెప్పింది.
వాటిని నమ్మినందుకు ఇంత మోసపోతామని అనుకోలేదని పల్లె జనం గొంతెత్తుతున్నారు. కాంగ్రెస్‌ను తిడుతున్నారు. బిజేపిని తూర్పారపడుతున్నారు. కేసిఆర్‌కు జై కొడుతున్నారు. కేసిఆర్‌కు జేజేలు పలుకుతున్నారు. ఇది సీమాంధ్ర మీడియా సహించలేకపోతోంది. జీర్ణించుకోలేకపోతోంది. ఎలాగైనా బిఆర్‌ఎస్‌ తక్కువ చేసేందుకు పడరాని పాట్లు పడుతోంది. తిన్నింటి వాసాలు లెక్కపెడుతోంది. తెలంగాణ మీద మళ్లీ విషం కక్కుతోంది. తెలంగాణ ప్రజలు ఎంత చైతన్యవంతులో తెలుసు. అయినా సీమాంద్ర మీడియా మళ్లీ మేకవన్నె పులి వేషం వేస్తోంది. కాంగ్రెస్‌ చెప్పిన అబద్దాలు నిండిన కొన్ని హమీలు ప్రజలను ఆకర్షించాయి. దాంతో ప్రజలు కాంగ్రెస్‌ వైపు మొగ్గారు. అంతే తప్ప కేసిఆర్‌ను కాదనుకోలేదు. కేసిఆర్‌ పాలన వద్దనుకోలేదు. కాని కేసిఆర్‌ మాత్రమే తెలంగాణను బాగు చేయగలడు. కేసిఆర్‌ మాత్రమే తెలంగణను కాపాడగలడు. కేసిఆర్‌ మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసం పాకులాడగలడు. కేసిఆర్‌ మాత్రమే తెలంగాణ ప్రగతిని కాంక్షిస్తాడు. తెలంగాణను అభివృద్ది పధంలో నడుపుతాడు. దేశంలోనే తెలంగాణను అగ్రస్ధానంలో నిలుపుతాడు. ఇది మళ్లీ ప్రజలు తెలుసుకున్నారు. కేసిఆర్‌ రోడ్‌షోలకు బ్రహ్మరధం పడుతున్నారు. చిన్నా,చితక, ముసలీ, ముతక అందరూ కేసిఆర్‌ను చూసేందుకు ఎగబడుతున్నారు. జై కేసిఆర్‌,జైజై కేసిఆర్‌ అని దిక్కులు పిక్కటిల్లేలా జేజేలు పలుకుతున్నారు. దటీజ్‌ పవర్‌ ఆఫ్‌ కేసిఆర్‌. దటీజ్‌ వాల్‌ ఆఫ్‌ తెలంగాణ కేసిఆర్‌. కేసిఆర్‌ బ్రాండ్‌ ఆప్‌ తెలంగాణ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!