వీణవంక,( కరీంనగర్ జిల్లా),
నేటి ధాత్రి: ఆవాల అరుంధతి గిరిబాబు మాట్లాడుతూ..ఐదు సంవత్సరాలు సర్పంచ్ పదవి కాలంలో ఉన్న మాకు సహకరించిన కొండపాక గ్రామ ప్రజలకు అవ్వలకు అక్కలకు చెల్లెళ్లకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. అదే విధంగా గ్రామ అభివృద్ధిలో భాగస్వాములైన గ్రామ ఉప, సర్పంచ్ రాజ్ కుమార్ వార్డు సభ్యులు తోడ్పాటు మరువలేనిది అని అన్నారు. ఈ ఐదు సంవత్సరాలలో గ్రామాన్ని ఐదు తరాల ముందుకు పోయే విధంగా అభివృద్ధి చేశామని విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇంతకాలం సహకరించిన ప్రజలకు, మీడియా మిత్రులకు, అధికారులకు, ప్రతిఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు
తెలియజేస్తున్నాము.