
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గుండాల పోలీస్ స్టేషన్లో రెండు సంవత్సరాల కాల వ్యవధిలో చేసినటువంటి ప్రతి కార్యక్రమంలో ఉద్యోగంలో మీరంతా సహకారులుగా ఉంటూ ఏ పని తలపెట్టిన గుండాల మండల ప్రజలందరూ, అధికారులు రెవెన్యూ, ఫారెస్ట్ ,ఎలక్ట్రికల్, పంచాయతీరాజ్ ,మరియు గ్రామంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, మీడియా మిత్రులు అందరూ కూడా చెప్పిన వెంటనే స్పందించి తన పనిగా భావించి ప్రతి కార్యక్రమమును విజయోత్సవంతో జరిపించిన అందరికి పేరుపేరునా ధన్యవాదాలు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. బదిలీపై గుండాల పోలీస్ స్టేషన్కు ఎస్హెచ్వో గా విధులు నిర్వర్తించబోతున్న ఎస్ఐ కు కూడా నాకు సహకరించినట్లు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహకరించిన ప్రతి ఒక్క పౌరుడికి ధన్యవాదాలు తెలిపారు. మీకు ఎటువంటి అవసరం ఉన్న నాతో తప్పకుండా సంప్రదించగలరని ఎస్ఐ రాజశేఖర్ అన్నారు.