గెలుపు ఆనందంలో అంబరాన్ని అంటిన అభిమానుల సంబరాలు
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గుండాల మండల కేంద్రంలో సినీ నటుడు కొణిదెల పవన్ కళ్యాణ్ విజయ దుందుభి మోగిన సందర్భంగా వారి అభిమానులు సంబరాలు చేసుకోవడం జరిగింది, మే 13న ఆంధ్రప్రదేశ్ లోజరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి సుమారు 70 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందిన పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనపై ఉన్న ప్రేమ అభిమానాన్ని బైక్ ర్యాలీ రూపంలో తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద స్థాయికి వెళ్లాలని కాంక్షిస్తూ ప్రేమతో మీ అభిమానులు.పవన్ కళ్యాణ్ గెలుపులో భాగంగా బత్తిని వినోద్,మజోజు పవన్,ధోనోజు శశిధర్,గంగాధరి రవి ,రాంబాబు ఆర్ఏంపి ,గడ్డం సాయి,బొబ్బిలి శేఖర్,వెంకటేష్,సిద్దు, రమేష్, నసీర్,నవీన్,అనిల్, విక్రమ్,షాహిద్,తదితరులు సంబరాలు పాల్గొన్నారు.