ఆలయ కమిటీ చైర్మన్ వి.రామ్ చందర్ నాయక్..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
నవాబుపేట మండలం యన్మన్ గడ్ల గ్రామం తూక్య తండా లో నిర్మించబోయే శ్రీ అంజనేయస్వామి దేవాలయ నిర్మాణానికి తమ వంతు సహాయంగా అందించే దాతలకు ఆలయ కమిటీ చైర్మన్ వి.రామ్ చందర్ నాయక్ ధన్యవాదాలు తెలియజేశారు. శుక్రవారం కారుకొండ గ్రామం శ్యామగడ్డ తండాకు చెందిన పి.చందర్ 10,000 పది వేలు రూపాయలు తనవంతుగా సహాయంగా ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ తూక్యతాండలో నిర్మించబోయే ఆలయానికి తమ వంతు సహాయంగా విరాళం అందించే దాతలకు అంజనేయస్వామి ఆశిశులు అతని కుటుంబం పై ఎల్లపుడు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వి .రామ్ చందర్ , వి, శ్రీను , సంతోష్ , చందర్ , రవి, దేవుల ,బాధ్య, తదితరులు పాల్గొన్నారు..