
మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి
నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా
నాగారం పురపాలక సంఘం కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ శ్రీ కౌకుట్ల చంద్రా రెడ్డి అధ్యక్షతన సాదరణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో 20 వార్డులలో అభివృద్ధి పనులకు గాను 2 కోట్ల 30 లక్షలకు సిసి రోడ్లు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు ఇతర పనులకు తీర్మానం చేయడం జరిగింది.ఈ సమావేశం నందు మున్సిపల్ చైర్మన్ శ్రీ కౌకుట్ల చంద్ర రెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో నాగారం మున్సిపాలిటీకి అన్ని రంగాలలో అభివృద్ధికి సహకరించిన కౌన్సిలర్ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి, వార్డ్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు మున్సిపల్ మేనేజర్ కే. చంద్రశేఖర్, ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.