సుంకరబోయిన మొగిలి
కొత్తగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు
కొత్తగూడ, నేటిధాత్రి:
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వకున్నా కానీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించినందుకు హర్షం వ్యక్తం చేసిన కొత్తగూడ మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకరబోయిన మొగిలి
వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేసేది చెపుతుంది చెప్పిందే చేస్తుంది
రాష్ట్రంలో ప్రజా పాలనలో భాగంగా మొదటి ప్రాధాన్యత మహిళలకు మరియు రైతులకు కల్పించారు ప్రజా ప్రభుత్వం రాగానే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం , ఉచిత గృహ జ్యోతి, ఉచిత 500 కే వంట గ్యాస్, సన్న వరి ధాన్యం కు 500 బోనస్, ఉద్యోగ అవకాశాలు కల్పించారు, రైతులకు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పెంపు, గత పది ఏళ్లలో అర్హులైన వారందరికీ ఏ ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వలేదు … కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాగానే తెలంగాణ ప్రభుత్వం
సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే అధికారికంగా
సర్వే నిర్వహించి కుల గణన చేసి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ప్రకటించారు
42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు అసెంబ్లీలో ఆమోదం తెలుపుతూ… నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డికి, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ అనసూయ సీతక్క కు, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ కు మరియు రాష్ట్ర మంత్రివర్గం కు గౌరవ సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఎమ్మెల్యేలకు బీసీలకు అండగా సహకరించిన ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపిన కొత్తగూడ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు సుంకరబోయిన మొగిలి,