డైట్ కాస్మోటిక్ చార్జీలు పెంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాల
“*కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ*
02.11.2024
*నేటిధాత్రి వరంగల్*
శనివారం
*కాకతీయ యూనివర్సిటీ* : హాస్టళ్లు, గురుకులాలు, ఇతర ప్రభుత్వ వసతి గృహాలలో విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతి నెలా చెల్లించే డైట్ మరియు కాస్మోటిస్ చార్జీలు పెంచుతూ ఉత్తర్వులు చేయడాన్ని హర్షిస్తూ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ అధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పూలతో అభిషేకం చేసి స్వీట్లు పంచారు, అనంతరం తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి నరేష్ లు మాట్లాడుతూ గత ప్రభుత్వం 7 ఏళ్లుగా డైట్ చార్జీలు మరియు 16 ఏళ్లుగా కాస్మోటిక్ చార్జీలు పెంచలేదని, ప్రస్తుతం విద్యార్థులకు డైట్,కాస్మోటిక్ చార్జీలు పెంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్ప మనసును చాటుకున్నారని అన్నారు
అనంతరం వారు మాట్లాడుతూ 7,65,705 మంది పేద విద్యార్థులకు మేలు కోరుతూ ప్రభుత్వం ఏకంగా 40 శాతం డైట్ కాస్మోటిక్ చార్జీలు పెంచిదని, వివిధ శాఖల ఆధ్వర్యంలోని హాస్టళ్లు, గురుకులాలు, ఇతర విద్యా సంస్థల్లోని విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతి నెలా చెల్లించే డైట్ మరియు కాస్మోటిస్ చార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం సంతోషదాయకం అన్నారు,డైట్ చార్జీలు: 3 నుంచి 7వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు రూ.950 నుంచి రూ.1330కు పెంపు,8 నుంచి 10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు రూ.1100 నుంచి రూ.1540కు పెంపు,ఇంటర్ నుంచి పీజీ వరకు విద్యార్థినీ విద్యార్థులకు రూ.1500 నుంచి రూ. 2100కు పెంపు, కాస్మొటిక్ చార్జీలు: 3 నుంచి 7వ తరగతి విద్యార్థినులకు రూ.55 నుంచి రూ.175కు పెంపు, 8 నుంచి 10వ తరగతి విద్యార్థినులకు రూ.75 నుంచి రూ.275కు పెంపు.విద్యార్థులకు 3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు రూ.62 నుంచి 150కు పెంపు, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.62 నుంచి రూ.200కు పెంచడం జరిగిందని, విద్యార్థి నిరుద్యోగ జేఏసీ పక్షాన సిఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఇంచార్జ్ పడిగెల అభిరామ్, కేయూ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు గుండేటి సుమన్, నిరుద్యోగ జేఏసీ నాయకులు కిరణ్, సోనీ,రజిత, అశ్విని,అనిల్, షరీప్, శ్రీకాంత్, క్రాంతి, మురళి, నవీన్ నాయక్, చందర్, అరుణ్ కుమార్, సాయి వికాస్ లతో తదితరులు పాల్గొన్నారు