
TGiiDC MD reviews NIMZ works in Jharasangam
నిమ్జ్ ను పరిశీలించిన టీజీఐఐసీ ఎండీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్) ఏర్పాటు కోసం సేకరించిన భూమి చుట్టూ కంచెను ఏర్పాటు చేయాలని, పంటల అనంతరం స్వాధీనం చేసుకోవాలని, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ నిమ్జ్ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, సీఈవో మధుసూదన్, అదనపు కలెక్టర్ మాధురి లతో కలిసి నిమ్జ్ ప్రాంతానికి పరిశీలించారు. ఇప్పటివరకు ప్రభుత్వం సేకరించిన భూమి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు
2.369 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. 3.245 ఎకరాలలో రోడ్లు, సాగునీరు, విద్యుత్తు మౌలిక సదుపాయాలను ఏర్పాటు కృషి చేయాలి అన్నారు. రైతులకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించిన భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని అన్నారు. మౌలిక వసతుల కల్పన కోసం రోడ్లు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వారి వెంట టీజీఐఐసీ అధికారులు పాల్గొన్నారు.