telangana leader kcr
రాసుకుంటూ పోతే అభివృద్ధి జాడలు వందలు.
`పదేళ్లు నెంబర్ వన్ గా గుర్తింపులు.
`అభివృద్ధి, సంక్షమం సమపాళ్ళు!

`సమగ్రభివృద్ధిలో తెలంగాణా పరుగులు
`పేదరిక నిర్మూలనలో అనేక మైలురాళ్లు.
`సాగురంగంలో ఒక్క తెలంగాణాలోనే విప్లవాత్మక ఫలితాలు.
`వ్యవసాయ రంగంలో అన్ని రాష్టాలను ఆదిగమించి దిగుబడులు.

`అన్ని రంగాలలో జాతీయ స్థాయి లో సింహ భాగం అవార్డులు.
`పల్లె ప్రగతిలో గణనీయమైన మార్పులు.
`పచ్చని వనాలు, పసిడి సిరులు, పాడి పంటలు.
`స్వచ్ఛమైన పల్లె వాతావరణం లో ప్రజల ఆరోగ్యాలు.
`రైతుకు పెట్టుబడి సాయాలు.. సకాలంలో ఎరువులు.
`ఊరిలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు.
`ఎండిన ఊరి చెరువుల్లో పుష్కళంగా నీటి సవ్వడులు.
`ఊరే కల్పతరువుగా కుల వృతులకు ఆదాయ వనరులు.
`ఎవరిని కదిలించినా చెప్పే మాట ఒక్కటే కేసీఆర్ తెలంగాణా దేవుడు.
హైదరాబాద్, నేటిధాత్రి:
శకునం చెప్పే బల్లి కూడా కుడితిలోపడిపోతుంది. ఒక్క అబద్దం వెయ్యి అబద్దాలను మోసుకొస్తుంది. అబద్దాలు ఆడని పరిస్దితిని సృస్టిస్తుంది. అబద్దాలు ఆడకుండా వుండలేని స్దితిలోకి నెట్టేస్తుంది. నిజం చెప్పడానికి నోరు రాకుండా చేస్తుంది. కళ్లుండి చూడకుండా చేస్తుంది. ఇది అబద్దం పవర్…ఆ పవర్ రాజకీయం. అరాజకీయం చేయాలనుకున్నప్పుడు అబద్దాలే ఆడతారు. సర్వం అబద్దాల మయం చేసుకుంటారు. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. మాజీ ఎమ్మెల్సీ దేవన పల్లి కవిత పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ ఏం పీకి కట్టలు కట్టిందని పార్టీ పేరు మార్చుకున్నారు? దేశ రాజకీయాలకు ఎందుకు వెళ్లాలనుకున్నారు? అనే ప్రశ్న సందించారు. తెలంగాణ ప్రజల కళ్లతో చూస్తే పదేళ్ల ప్రగతి కనిపిస్తుంది. ప్రత్యర్దుల కళ్లతో చూస్తే ఏడారి మాత్రమే దర్శనమిస్తుంది. కళ్ల ముందు రత్నాలు కూడా గులక రాళ్లే అనిపిస్తుంది. కేసిఆర్ పదేళ్లలో చేసిన అభివృద్ది ప్రజల ముందే వుంది. అది ప్రత్యర్దులకు కనిపించదు. విమర్శలకు మాత్రమే పనికొస్తుంది. కవితకన్నా కాంగ్రెస్ నయం. పదేళ్లలో అవినీతి జరిగిందని చెబుతోంది. అంటే పనులు జరిగినట్లు పరోక్షంగా కాంగ్రెస్ ఒప్పుకున్నది. అందుకే కాళేశ్వరం గురించి పదే పదే ప్రస్తావిస్తుంది. కాని కవిత అసలు ఏం జరగలేదంటోంది. కాళేశ్వరం కూడా ఆమె కంటకి కనిపించడం లేదు. పదేళ్లలో తెలంగానలో వచ్చిన మార్పులు ఏమీ కనిపించడం లేదు. బాణం ఇప్పటి వరకు అన్న మీద, హరీష్ మీద గురిపెట్టింది. ఇప్పుడు ఏకంగా కేసిఆర్ మీదకే తిప్పింది. తప్పంతా తండ్రిదే అనే అర్దమొచ్చేలా మాట్లాడుతోంది. కేసిఆర్ పదేళ్లలో ఏం చేయలేరంటే ప్రజలు కూడా నమ్మరని తెలిసినా పగపట్టినట్లు చెబుతోంది. కాని ఆమె కోసం కాకపోయినా ఈ తరం యువత కోసమైన కొన్ని తెలియాలి. అంటే తెలంగాణకు ముందు రోజులు ఎలా వుండేవో ఒక్కసారి కళ్లు ముందు కనిపించాలి. సరిగ్గా పన్నెండు సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రాంతం ఒక ఎడారి గా మార్చబడిన ప్రాంతం. ఎడారిలోనైనా ఖర్జురాలు పండే ప్రదేశాలు వుంటాయి. కాని తెలంగాణ కరువు రక్కసి బారిన పడి విలవిలాడిరది. పాలకులు సృష్టించిన విద్వంసంలో చిక్కిశల్యమైంది. కొన్ని శతాబ్దాలుగా అన్ని రంగాలలో గణనీయమైన గతిని సంతరించుకున్న తెలంగాణ ఉమ్మడి పాలకుల చేతిలో పడి విలవిలలాడిరది. ఒకప్పుడు తెలంగాణలోని ప్రతి పల్లె ఒక గంగాళం. ఊరుకు కనీసం రెండు చెరువులు. ఊరు చుట్టూ పొరుగు గ్రామాల చెరువులు. ఇలా తెలంగాణ అంతా నీటితో కళకళలాడిన కాలం వుంది. నిజాం పాలనలో కూడా కరువు లేదు. కష్టం లేదు. ప్రజలు అన్నమో రామచంద్రా అనలేదు. అందుకే నిజాం కాలంలో కూడా భూముల పంచాయితీ వుందే తప్ప నీళ్ల గోస లేదు. పాడి పంటలు పుష్కలంగా వున్నాయి. అందుకే రైతులనుంచి ఆ రోజుల్లో రాజులు 6శాతం శిస్తు వసూలు చేసుకున్నారు. అయినా రైతులు ఆకలి బాదలు ఎదుర్కొలేదు. పరిపూర్ణమైన పంటలు పండిరచుకున్నారు. తెలంగాణలో సగర్వంగా రైతులు జీవించారు. కాకతీయుల కాలం తవ్విన చెరువులు బావులు ఇంకా మన కళ్లముందే వున్నాయి. రహదారుల వెంట కూడా మంచి నీటి బావులు తవ్వి ప్రజల దాహార్తిని ఆ రోజుల్లో రాజులు తీర్చారు. అందుకే డిల్లీ నుంచి కూడా రాజులు తెలంగాణ మీద దండయాత్రలకు వచ్చారు. అంతెందుకు దక్షిణాదిలో తెలంగాణ దాటితే ఏ డిల్లీ రాజు ముందుకు వెళ్లలేదు. అంత సంపద తెలంగాణలోనే దొరికింది. నీళ్ల కొదువలేదు. తమిళనాడు, కర్నాటక ప్రాంతాలలో కావేరీ జలాల వివాదంతో పంటలు లేక యుద్దాలు చేసుకున్న రాజులున్నారు. చోర, చేళ, పాండ్య రాజుల కూడా రైతులకు నీళ్లివ్వలేకపోయారు. ఇప్పటికీ జలాల వివాదాలలో ఆ రెండు రాష్ట్రాలు మునిగితేలుతూనే వున్నాయి. కాకతీయ కాలంతో పాటు అంతకు ముందే తెలంగాణలో వున్న చెరువులను చూసి తమిళనాడు రాజులు కూడా చెరువులు తొవ్వించుకున్నారు. రాయల కాలంలో రత్నాల మాట వినడమే తప్ప చూడలేదు. కాని నైజాం కాలంలో గోల్కొండ రాజ్యంలో వజ్రవైడూర్యాలు విదేశీయులు వచ్చి కొనుగోలును చూసిన వారున్నారు. అందుకు సాక్ష్యాలు కూడా వున్నాయి. ఆ రోజుల్లోనే పది వేల కోట్ల రూపాలయ జాకబ్ డైమండ్ పేపర్ వెయిట్‌గా పెట్టుకున్న నిజాం రాజున్నాడు. రాజులు సంపన్నులైతే సహజంగా ప్రజలు కూడా ధనవంతులన్నట్లే లెక్క. ఆంధ్ర ప్రాంతం కూడా కరువుతో అల్లాడిన ప్రాంతామే. ఎప్పుడైతే రాజమండ్రి, విజయవాడలలో కాటన్పుణ్యమా? అని బ్యారేజీలు నిర్మాణం జరిగాయి. అప్పటి నుంచి పంటలు మొదలయ్యాయి. కాని తెలంగాణలో ఏ ప్రాజెక్టులు లేకపోయినా, చెరువులే కల్పతరువులై సిరుల పంటలు పండిరచాయి. అలాంటి తెలంగాణ మళ్లీ కేసిఆర్ పాలనలో ప్రజలు చూశారు. సుమారు 60 ఏళ్ల కాలంలో ఆనవాలు కోల్పోయిన చెరువులన్నీ తెలంగాణలో కేసిఆర్ పాలనతో ప్రత్యక్ష్యమయ్యాయి. అదీ కేసిఆర్ అంటే. నిజానికి ఏ తెలంగాణ వ్యక్తి ఊహించలేదు. ఏ తెలంగాణ వాది చెరువులకు పూర్వ వైభవం వస్తుందని అనుకోలేదు. ఒక వేళ చెరువులు బాగు చేయాలనుకున్నా సాద్యం కాదనుకున్నారు. కాని సాద్యం కాదనుకున్న వాటిని సుసాద్యం చేయడమే కేసిఆర్ పట్టుదల. రాదననుకున్న తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ వచ్చేది లేదు, సచ్చేది లేదన్న వారి కళ్లముందే తెలంగాణ తెచ్చి చూపించిండు. నిజాం కాలంలోనే కరంటు చూసిన తెలంగాణను ఉమ్మడి రాష్ట్రంలో చీకటి చేసిన్రు. చెరువులను చెడగొట్టి, తెలంగాణ సాగును సర్వనాశనం చేశారు. చెరువులు ఆగం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం నిర్లక్ష్యం చేశారు. ఉమ్మడి రాష్ట్రం రాకముందే నిజాం నిర్మాణం చేయాలనుకున్న ప్రాజెక్టులను ఆపేశారు. ఆఖరుకు నిజాం సాగర్‌కు సరైన మరమ్మత్తులు చేయలేదు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం, సీట్ల కోసం ప్రాజెక్టుల పేరు శంకుస్దాపనలు చేయడం…జనాలను మభ్య పెట్టారు. నీళ్లు, నిధులన్నీ ఏపికి తీసుకెళ్లారు. చెరువులు నింపలేదు. ప్రాజెక్టులు కట్టలేదు. ఆఖరుకు రైతులు బోర్లు వేసుకోకుండా వాల్టా చట్టం తెచ్చారు. కరంటు ఇవ్వకుండా సాగు సాగకుండా చేశారు. మంచి నీళ్లకు దిక్కులేకుండా చేశారు. ఇన్ని సకల దరిద్రాలను నెత్తిన రుద్దిన ఆంద్రా పాలకుల నుంచి తెలంగాణను విముక్తి చేసింది కేసిఆర్ కాదా? పదేళ్లలో ఇవన్నీ పునరుద్దరించింది కేసిఆర్ కాదా! తెలంగాణలో చెరువులన్నీ బాగు చేసింది కేసిఆర్ కాదా! తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే ఇరవై నాలుగు గంటల కరంటు తెచ్చింది కేసిఆర్ కాదా! ఉమ్మడి రాష్ట్రంలో కరంటు కష్టాలు తప్ప వెలుగులు లేవు. సాగుకు నీళ్లు లేవు. కాని తెలంగాణ వచ్చిన ఆరు నెలల్లోనే చెరువులోకి నీళ్లు రాలేదు. మూడు నెలల్లోనే ఇరవై నాలుగు గంటల కరంటు రాలేదా? ఐదేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరగలేదా! ప్రపంచంలోనే అతి పెద్ద బహులార్ధక ఎత్తిపోతల పథకంగా చరిత్ర సృషించలేదా! కాళేశ్వరం నీళ్లన్నీ తెలంగాణ మొత్తం పారలేదా! ఇలా పదేళ్లలోనే ఇంతటి ప్రగతిని చూపించిన నాయకుడు దేశంలోనే ఎవరైనా వున్నారా! చరిత్ర తిరగేసినా కనిపిస్తారా! నాగార్జున సాగర్ , శ్రీశైలం లాంటి ప్రాజెక్టుల మూడున్నర దశాబ్దాల పాటు కట్టారు. జూరాల లాంటి 9 టిఎంసిల రిజర్వాయర్ ముప్పై ఏళ్లు కట్టారు. కాని 50 టింఎసిల మల్లన్న సాగర్ మూడేళ్లలలో పూర్తి చేశారు. దానితోపాటు పదలు సంఖ్యలో ఏక కాలంలో పది టిఎంసిలకు పైగా నిలువ సామర్ధ్యం వున్న రిజర్వాయర్లు నిర్మాణం చేశారు. ఇవన్నీ పనులు కాదా! కవిత కంటికి కనిపించకుండాపోయాయా? ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ పోరాటం , కష్టాలు ఒడువని ముచ్చట కాలోజీ ఎలా చెప్పాడో కేసిఆర్ పాలనలో జరగిన ప్రగతిని చెప్పుకుంటూ పోతే కూడా ఒడువని ముచ్చటే…తరతరాలకు తరగని చరిత్రే.. భవిష్యత్తు తరాలకు వెలుగులు పంచిన పాలనే..కేసిఆర్ పదేళ్ల పాలన స్వర్ణయుగమే! రామరాజ్యంలో కూడా అరమరికలువుంటాయి. ఏ ప్రభుత్వంలోనైనా కొన్ని పూర్తి కాని పనులుంటాయి. కాని వాటిని ముందేసుకొని, అందుతున్న ఫలాలను గుర్తించని వారికి ఎంత చెప్పినా వినిపించవు. చూపించినా కనిపించవు.
