Temrees Students Secure Free MBBS Seats
ఎంబిబిఎస్ ఫ్రీ సీట్లు సాధించిన టెమ్రీస్ విద్యార్థులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: జహీరాబాద్ మండలం అల్గోల్ గ్రామంలోని మైనారిటీ బాలుర గురుకులం – టెమ్రీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు చెందిన ముగ్గురు ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ఉచిత సీట్లు సాధించారు. ఎమ్.డి ఉబేద్ నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీలో, గౌతమ్ కన్న నిర్మల్ మెడికల్ కాలేజీలో, డీ.స్రుజన్ కుమార్ ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీలో సీట్లు పొందారు. సంస్థ ప్రిన్సిపాల్స్ జే.రాములు, కె.ఎస్ జమీల్ విద్యార్థులను అభినందించారు.
