శివరాత్రి వేడుకలకు ముస్తాబైన ఆలయాలు

శివరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం

శాయంపేట నేటి ధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని శ్రీ శివ మార్కండేయ, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సముదాయాలలో మహా శివరాత్రి ఉత్సవాల నిర్వాహనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ లు బాసాని సూర్య ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 8న మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, ప్రధమ రుద్రాభిషేకం, 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అర్చనలు, అష్టోత్తర పూజలు, రాత్రి 9:30 గంటలకు శివపార్వతుల కళ్యాణం, రాత్రి 12 గంటలకు లింగోద్భావ పూజలు, భజన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో అర్చకులు మార్త రాజ్ కుమార్  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!