ఆలయాలు ప్రశాంతతకు నిలయాలు మహామండలేశ్వర్ సిద్దేశ్వరానందగిరి.
జహీరాబాద్. నేటి ధాత్రి:
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి నుంచి మానవులు ఉపశమనం పొందడానికి ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 1008 మహామండలేశ్వర్ మహంత్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ పేర్కొన్నారు.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి నుంచి మానవులు ఉపశమనం పొందడానికి ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని, వాటి పరిరక్షణ బాధ్యత అందరిపై ఉందని బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 1008 మహామండలేశ్వర్ మహంత్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కొత్తూర్ (బీ) విఠలేశ్వర దేవాలయంలో భక్తులకు ప్రవచనామృతాన్ని అందించారు. ఈనెల 10న బెల్లాపూర్ దత్తగిరి ఆశ్రమం నుంచి ప్రారంభమైన పాదయాత్ర పల్లకి సేవ న్యాల్ కల్ మండలం హద్నూర్ దత్త గిరి ఆశ్రమం నుంచి ఉదయం బయలుదేరి న్యామతాబాద్ చౌరస్తా, గంగ్వార్, బంగ్లా మీర్జాపూర్, కొత్తూర్ (బి), బీదర్ క్రాస్ రోడ్ మీదుగా జహీరాబాద్ పట్టణంలోని కైలాసగిరి శివాలయానికి చేరుకుంది.