
కమలాపూర్ ఆర్యవైశ్య ఆధ్వర్యంలో తహసిల్దార్ కు వినతిపత్రం……………
నేటిదాత్రి కమలాపూర్ (హన్మకొండ)హైదరాబాదులో గల తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగించకుండా అలానే కొనసాగించాలని మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భూపతిరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ కమలాపూర్ తహసిల్దార్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా కమలాపూర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొనిశెట్టి మునిందర్ మాట్లాడుతూ ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంలో ఇబ్బందుల గురవుతూ,నానా అగచాట్లు పడుతున్న తెలుగు ప్రజలందరిని ఒక్కచోటికి చేర్చాలనే లక్ష్యంతో,తెలుగు ప్రజలందరికీ ఒక ప్రత్యేకమైన రాష్ట్రం కావాలనే పట్టుదలతో 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన పొట్టి శ్రీరాములు పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వం వారి పేరు మార్చేందుకు సిద్ధపడటం చాలా దురదృష్ట సంఘటనని పొట్టి శ్రీరాములు ఒక ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి కాదని,తెలుగు ప్రజలందరి ఐక్యత, క్షేమం కోసం పోరాడి అసువులు బాసిన మహామేధావి అని, అంతే కాకుండా భారత జాతీయ ఉద్యమంలో కూడా మహాత్మా గాంధీ తో పాటు పలు కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు అని కొనియాడారు. 1985 లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హైదరాబాదులో తెలుగు విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాడని తదనంతరం పరిణామాల్లో ఆ విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును పెట్టడం జరిగిందని,విభజన అనంతర ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు విశ్వవిద్యాలయం శాఖలు కొనసాగుతున్నాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలని పొట్టి శ్రీరాములు గారి పేరును కొనసాగించాలని హెచ్చరించారు.ఒక మహానీయుని పేరు తొలగించేటప్పుడు వారి త్యాగనిరతిని,వారి పూర్వపరాలు పరిశీలించాలని అలా కాకుండా నచ్చని వ్యక్తుల పేర్లు
తొలగించి, తనకు ఇష్టమైన వారి పేర్లు పెట్టడం మంచి సంప్రదాయం కాదని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం సురవరం ప్రతాపరెడ్డి గారి పేరున వేరే సంస్థకు గాని లేదా నూతనంగా ఏర్పాటు చేసే మరో సంస్థకైనా పెట్టుకోవచ్చని ప్రతాప రెడ్డి గారి పై మాకు ఎలాంటి వ్యతిరేక భావన లేదని పేర్కొన్నారు.ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి శ్రీరాములు గారి పేరు కొనసాగించాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్యులందరు ఉద్యమించక తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల సంఘం అధ్యక్షుడు భూపతి రాజు,పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొనిశెట్టి మునిందర్,వైశ్య సంఘం నాయకులు నూక సాంబమూర్తి,భూపతి ప్రవీణ్,శివశంకర్,శింగి రికొండ యుగంధర్, దొంతుల నాగేశ్వరరావు, తోడుపునూరి జగదీశ్వర్, దోమకుంట్ల ఓం ప్రకాష్, మాడిశెట్టి రమేష్, నంగునూరి సాగర్ బాబు,నూక వీరభద్రయ్య, రమేష్,కృష్ణమూర్తి, మాడిశెట్టి సంపత్, అల్లాడి వేణు,ఉప్పుల ఓం ప్రకాష్,గుండా రాజు,తదితరులు పాల్గొన్నారు.