TDP Counters YSRCP Allegations in Palamaneru
*వైసీపీ నేతల విమర్శలను తిప్పికొట్టిన తెలుగు తమ్ముళ్లు..
*వైకాపా అవినీతి భాగోతంపై తీవ్ర ఆరోపణలు..
పలమనేరు(నేటి ధాత్రి)
పలమనేరు మున్సిపల్ పరిధిలో గత రెండు రోజులుగా జరుగుతున్న అధికార ప్రతిపక్ష పార్టీ నేతల విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడిన అంశంపై చెలరేగిన ఈ వ్యవహారం ఇరు పార్టీల నేతల వాదోపవాదాలకు కారణమైంది. ఇలా ఉండగా శనివారం వైకాపా నేతలు చేసిన విమర్శలను తిప్పికొడుతూ తెలుగు తమ్ముళ్లు సోమవారం స్థానిక టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారుఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా తమ స్వప్రయోజనాల కోసం పాటుపడుతున్నారని విమర్శించారు. టిడిపి నేతలపై అసత్యపు ఆరోపణలు చేస్తే వాటిని తిప్పికొట్టడమే గాక వైకాపా నేతల అవినీతి భాగోతాన్ని బయట పెడతామని వారు హెచ్చరించారుఇకనైనా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలపై దృష్టి సారించాలి గాని ఇలాగే కొనసాగితే ఏ అంశంలోనూ తాము వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో నాయకులు ఆర్ బిసి కుట్టి, సుబ్రహ్మణ్యం, గౌడు, నాగరాజు, గౌడు,రూపేష్, శ్రీధర్,మదన్, బిఆర్ సి కుమార్,సుబ్రహ్మణ్యం, చిన్నీ,కోటి, నదీం, శ్రీనివాసులు, లోకేష్,గబ్బర్ సింగ్ తదితరులున్నారు.
