ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు,తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు..
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మరియు సిబ్బందికి పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది..
ఈ సందర్భంగా మాట్లాడుతూ,
తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి ఆత్మ బలిదానాలను ఆపేందుకు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత,తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని అన్నారు..
ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు సోనియా గాంధీ అవకాశం వచ్చిన దేశ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని తృణప్రాయంగా భావించాలని చెప్పారు.తెలంగాణ ఇచ్చిన తల్లి శ్రీమతి సోనియా గాంధీ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండి ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము అని అన్నారు..
అదేవిధంగా సోనియా గాంధీ ఆధ్వర్యంలో, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ కార్గే అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని మరొకసారి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో
మాజీ ప్రజప్రతినిధులు,మండల నాయకులు యువజన నాయకులు మహిళా నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు..