పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ స్వర్ణయుగం
ఉద్యమ పార్టీకి 25ఏళ్ళు పూర్తి.
తెలంగాణా ప్రజల గుండెల్లో కేసీఆర్
తెలంగాణలో భవిష్యత్ బిఆర్ఎస్ పార్టీదే
రజతోత్సవ సభ సంబురాలు అంబారాన్ని అంటాలి.
బిఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి.
నర్సంపేట నియోజకవర్గo నుండి 25000 మంది కార్యకర్తలు తరలి రావాలి
బిఆర్ఎస్ నాయకులతో కలసి రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరణ
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆవిర్భవించిన టిఆర్ఎస్ ఉద్యమ పార్టీకి 25 యేండ్లు పూర్తి కానున్నదని తెలంగాణ ఉద్యమనేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర సాధన అనంతరం కెసిఆర్ పాలన స్వర్ణయుగంగా ఉన్న తరుణంలో నేడు కాంగ్రెస్ పాలన రాక్షస పాలనగా మారిందని ఆరోపించారు. గత 15 నెలల కాంగ్రెస్ పాలన సాగుతున్న క్రమంలో ప్రజల గుండెల్లో నేటికీ కేసీఆరే ఉన్నారని తెలిపారు. రజతోత్సవ సభ సంబురాలు అంబారాన్ని అంటాలని పిలుపునిచ్చారు.తెలంగాణలో రాబోయే భవిష్యత్తు బిఆర్ఎస్ పార్టీదే అని తేల్చి చెప్పారు. ఈనెల 27న వరంగల్ జిల్లాలో చేపట్టబోయే భారత రాష్ట్ర సమితి రజితోత్సవాల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రజితోత్సవ సంబరాల గోడ పత్రికలను పెద్ది ఆవిష్కరించారు.ఈ సంధర్భంగా మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే సభలు నిర్వహించిన సత్తా బిఆర్ఎస్ పార్టీదే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పనితీరును గత కేసిఆర్ ప్రభుత్వ పనితీరు పట్ల గ్రామాల స్థాయి నుండి మండలాల వరకు ప్రజలతో చర్చ మొదలు పెట్టాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పట్ల విసుకు చెందుతున్న ప్రజలు కేసీఆర్ నాయకత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందని గుర్తుకు చేసుకుంటున్నారని తెలిపారు. పార్టీ కోసం గత ఎన్నికల్లో కష్టపడ్డ వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించి మెజారిటీ స్థానాలను గెలిపించే బాధ్యత నాది అని పెద్ది హామీ ఇచ్చారు. రాజకీయంలో గెలిచినా ఓడిన ప్రజల మధ్యలో బతికేవాడే నిజమైన నాయకుడని అదే స్థాయిలో నిత్యం ప్రజల్లో ఉంటున్నానని గుర్తుకు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే కంటే నా హాయంలోనే అన్ని గ్రామాల్లో 10 రేట్ల పనులు ఎక్కువ పనిచేశామని అధికార పార్టీ వాళ్లు అంటున్నారని పేర్కొన్నారు. 27 న సభ విజయవంతం చేసే క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట నియోజకవర్గం నుండి 25 వేల మంది కార్యకర్తలను తరలించి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్ద నర్సంపేట పౌరుషం చూపించాలని,రజతోత్సవ సభ సంబురాలు అంబారాన్ని అంటాలని ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఎండల తీవ్రత ఎక్కువగా ఉందడం వలన అధిక సంఖ్యలో పురుషులు హాజరవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు వెంకటనారాయణ గౌడ్,అన్ని మండల పార్టీ అధ్యక్షులు, మాజీ సొసైటీ చైర్మన్ లు , మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పిటిసిలు, నియోజకవర్గ నాయకులు, క్లస్టర్ బాధ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.