మానుకోట చరిత్ర తెలంగాణ మరవదు

పొన్నం తెలంగాణ ఉద్యమ కారుడు……

కౌశిక్పై కమలాపూర్ కాంగ్రెస్ ఫైర్….

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పట్ల హుజురాబాద్ శాసన సభ్యుడు కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యల పట్ల కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది.గురువారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ కు కౌశిక్ రెడ్డి కి నక్కకు నాగలోకానికి అంత వ్యత్యాసం వుందని,సహజంగా తెలంగాణ ఉద్యమ కారుడైన మంత్రి కి,తెలంగాణ ఉద్యమ సమయములో తెలంగాణ ప్రజల పై మానుకోట లో రాళ్ల దాడికి పాల్పడిన కౌశిక్ రెడ్డి కి పోలికే లేదని,పొన్నం ప్రభాకర్ ను విమర్చించే స్థాయి లేదని అన్నారు.కౌశిక్ చరిత్ర అందరికీ తెలుసు అని,పార్టీ లు మార్చిన వ్యక్తి కౌశిక్ అని,రాష్ట్రం లో ఏ నియోజక వర్గం నుండి ఐనా పోటీ చేసి గెలిచే సత్తా వున్న నాయకుడు పొన్నం అని కొనియాడారు.చిల్లర మాటలు మాట్లాడటం అపక పోతే కౌశిక్ రెడ్డి నీ కాంగ్రెస్ శ్రేణులు తరిమి కొడతాయి అని హెచ్చరించారు. ఈ సమావేశంలో హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ పోడేటి బిక్షపతి,తౌటం రవీందర్,సీనియర్ నాయకులు బాలసాని రమేష్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దేశిని ఐలయ్య,మండల బీసీ సెల్ అధ్యక్షుడు కొండా రమేష్,హుజురాబాద్ నియోజకవర్గ యువజన జనరల్ సెక్రటరీ విష్ణుదాసు వంశీధర్ రావు,జనగని శివకృష్ణ గౌడ్,నాంపల్లి ప్రభాకర్,బొల్లం రాజిరెడ్డి,బాలపురి కనకరత్నం,గట్టు శ్రీధర్, రాములు,అక్కినపల్లి భిక్షపతి,కుమార్,రాజేందర్,కంకటి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!