Telangana Thalli Statue Unveiled in Mancherial
కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ
నృత్యాలతో అలరించిన టీజీఎంఎస్ విద్యార్థులు
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని డీసీపీ భాస్కర్ తో కలసి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆవిష్కరించారు.మంగళవారం ఉదయం 10 గంటలకు నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయ భవనంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని అధికారులు విజయవంతం చేశారు.మంచిర్యాల రాజీవ్ నగర్ లోని టీజీఎంఎస్ పాఠశాల విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో వీక్షకులను అలరించారు.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ప్రజాపాలన -ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు.రాష్ట్రవ్యాప్తంగా 27 జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.మంచిర్యాల కలెక్టరేట్ లోని తెలంగాణ తల్లి విగ్రహం ఆకుపచ్చ చీర,సాంప్రదాయ ఆభరణాలతో రూపొందించారు.ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.
