చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం గుడి పేట ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పని చేస్తున్న లకావత రవిని
తెలంగాణ టీచర్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులుగా టి టి యు జిల్లా అధ్యక్షులు కొండికొప్పుల రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి తడకల సురేష్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. నియామకానికి సహకరించిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ సంఘం బలోపేతానికి, విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తోడు ఉపాధ్యాయులు రవికి అభినందనలు తెలియజేశారు