తెలంగాణ స్టేట్ ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేట్ గా పేరు మార్చాలి

తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసాపురం రవీందర్

గొల్లపల్లి నేటి ధాత్రి:
తెలంగాణ స్టేట్ ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేట్ గా పేరు మార్చాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసాపురం రవీందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరారు.వివరాల్లోకి వెళితే గొల్లపెల్లి మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసాపురం రవీందర్ మాట్లాడుతూ…తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం 1200 మంది బలిదానం దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినట్టయితే పార్టీ చాలా నష్టపోతది అని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు ,కానీ టెక్నికల్ గా తెలంగాణ ఏర్పడడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ఏర్పడింది కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత కాబట్టి తెలంగాణకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్రంగా పేరు మార్చాలని రాష్ట్ర కార్యదర్శి నరసాపురం రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో నరసాపురం రవీందర్ తో పాటు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు మద్దిల గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి మధు ,గొల్లపెల్లి పట్టణ అధ్యక్షులు గంగాధర మధుసూదన్, రాపల్లి అధ్యక్షులు గడుగు విజయ్, సదానందం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *