Judge Panchakshari Conducts Surprise School Inspection
ఆకస్మికంగా స్కూల్స్ తనిఖీ చేసిన తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్
సెక్రెటరీ
జడ్జి చిలుక మారి పంచాక్షరి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళపల్లి మండలంలోని ఎం జె పి స్కూల్ అలాగే కస్తూర్బా స్కూల్ గ్రామపంచాయతీ భవనంలో విలేజ్ లీగల్ కేర్ సపోర్ట్ సెంటర్ను తనిఖీ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఎం జె పి స్కూల్ ప్రిన్సిపాల్ అలాగే కస్తూర్బా స్కూల్ ప్రిన్సిపాల్ తో కలిసి వంటగదిలను డైనింగ్ హాల్స్ టాయిలెట్స్ టీచింగ్ పరిశీలించి అనంతరం పంచాక్షరి జడ్జిగారు మాట్లాడుతూ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంచి నాణ్యత మైన భోజనం అందించాలని మంచి చదువు బోధించాలని స్కూల్ ప్రిన్సిపాల్ లకు సూచించారు అలాగే విద్యార్థులతో మాట్లాడుతూ భవిష్యత్తులో మీరు ఏ లక్ష్యం కోసం చూస్తున్నారో ఆ లక్ష్యం అందే వరకు పిల్లలు ఉన్నతమైన చదువులు చదివి మీ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పి ఎల్ వి మంగళపల్లి శ్రీనివాస్ ఎస్ ఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు
