# సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈసంపెల్లి బాబు.
నర్సంపేట,నేటిధాత్రి :
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్పూర్తితో ప్రతీ ఒక్కరూ ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈసంపెల్లి బాబు అన్నారు.ఈ నెల 10 నుండి 17 వరకు నిర్వహిస్తున్న వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా నర్సంపేట పట్టణంలోని ఐఎంఏ హాల్ లో వారోత్సవాల సభ సిపిఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈసంపెల్లి బాబు మాట్లాడుతూ 1945నుంచి1951 వరకు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కొనసాగిందని ఆ క్రమంలో నెహ్రు సైన్యం, నైజం ప్రభుత్వ పోలీసులు గుండాల దౌర్జన్యాలకు 4000 మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ప్రజలు మరణించారని అన్నారు. భూమికోసం భుక్తి కోసం విముక్తి కోసం వీర తెలంగాణ రైతన్న సాయుధ పోరాటం మహారాష్ట్రలోని కొంత ప్రాంతం కర్ణాటకలోని కొంత ప్రాంతం అలాగే తెలంగాణ ప్రాంతంలో నిర్వహించగా ఈ పోరాటం స్పూర్తితో ప్రపంచవ్యాప్తంగా గుర్తించి అనేక దేశాలలో పోరాటాలు కొనసాగాయని పేర్కొన్నారు. ఈ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే ఉన్నాయని కానీ నేడు కొన్ని పార్టీలు మేము అంటే మేమే వారసులమని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్య సమ్మయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొరబోయిన కుమారస్వామి,జిల్లా కమిటీ సభ్యులు నమిండ్ల స్వామి,బోళ్ల సాంబయ్య, మండల నాయకులు కందికొండ రాజు,ఎండీ ఫారిదా,రుద్రారపు లక్ష్మి, బుర్రి ఆంజనేయులు,బేంబెలి మాలహల్ రావు,చల్ల నర్సింహారెడ్డి, మొగిలి, సంజీవ రెడ్డి, అక్కపెల్లి సుధాకర్, పెండ్యాల సారయ్య, కమతం వెంకన్న, చెల్పూరి మొగిలి, వజ్జంతి విజయ,జగన్నాధం కార్తీక్,బిట్ర స్వప్న,ఉదయగిరి నాగమణి, ,గణిపాక ఇంద్ర,బి లక్ష్మి, కలకోటి అనిలు, గణిపాక విలియం కేరి,మండలం నాయకులు తదితరులు పాల్గొన్నారు.