
ముఖ్య ఆర్థిక వనరు పర్యాటకం అని కాకతీయ విశ్వవిద్యాలయ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బి సురేష్ లాల్ అన్నారు. విశ్వవిద్యాలయ చరిత్ర టూరిజం విభాగ అద్వర్యంలో ఇంచార్జ్ విభాగాదిపతి డాక్టర్ ఎం.బ్రహ్మ్మయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశం లో విద్యార్థులను, పరిశోధకులను, బోధనా సిబ్బంది ని ఉద్దేశించి సురేష్ లాల్ ప్రసంగించారు. భారత దేశ పర్యాటకం చాల గొప్పది అని, మనకున్న తీర ప్రాంతంతో బీచ్ టూరిజం అబివృద్ది చేయవచ్చు అని అన్నారు. మనకున్న ప్రాచీన దేవాలయ్లతో, సహజ సిద్ధమైన అడవులు, గిరిజన జాతరలతో, నది జలాలతో పర్యాటకులను ఆకర్షించవచ్చు అని అన్నారు. ఆ దిశగా పరిశోధనలు చేసి ప్రభుత్వానికి ప్రపోజల్సు పంపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విభాగ అధ్యాపకులు డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ కే.వి.ఎస్ నరేందర్, డాక్టర్ ఎం. కృష్ణ సుమంత్, డాక్టర్ కే.నాగేశ్వర్ రావు, డాక్టర్ బి.శ్రీధర్, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.