తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా కుమ్మరి రేణుక
వరంగల్, నేటిధాత్రి
తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గంను హైదరాబాదు లోని అశోక హోటల్లో ఎన్నుకున్నట్లు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా కుమ్మరి రేణుక, నాయబ్ తహసీల్దార్, నర్సంపేట్ ను, అలాగే గౌరవ అధ్యక్షులుగా లచ్చిరెడ్డి, అదేవిధంగా తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా షేక్ ఇమామ్ బాబా, డిప్యూటీ తహసిల్దార్ భూపాలపల్లి. అలాగే స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా సయ్యద్ అజరుద్దీన్, సెక్రటరీగా సూర్య ప్రకాష్, మరియు సురేష్ ఈసీ మెంబెర్ గా ఎన్నుకున్నట్లు గౌరవ అధ్యక్షులు తెలిపారు.
అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఏర్పాటు
హైదరాబాద్ లో రెవెన్యూ అధికారులు సిబ్బంది సమక్షంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అంగరంగ వైభవంగా ఏర్పాటు కావడం జరిగింది. ఈసమావేశమునకు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి ఆఫీసు సబార్డినేట్స్, జూనియర్ అసిస్టెంట్స్, సీనియర్ అసిస్టెంట్, డిప్యూటీ తాసిల్దార్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు, వందల సంఖ్యలో హాజరు అయి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ ఏర్పాటు ఆవశ్యకతను మరియు భవిష్యత్తులో రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమానికి వారు తీసుకోబోతున్న చర్యల గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు లచ్చిరెడ్డి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ కార్యదర్శి రామకృష్ణ, తహసీల్దార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాములు, జనరల్ సెక్రటరీ రమేష్ పాక, సెక్రటరీ జనరల్ ఫుల్ సింగ్, మహిళా అధ్యక్షులు రాధ, ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి స్టేట్ యూనియన్లో మా అందరికీ ఈ పోస్టులు రావడానికి కృషి చేసిన అసోసియేట్ ప్రెసిడెంట్ తహసిల్దార్ ఎండీ ఇక్బాల్, విక్రమ్, నాగేశ్వర్ రావు మరియు విశ్వప్రసాద్ లకు కృతజ్ఞతలు తెలియచేశారు నూతన కార్యవర్గం.