
యాదాద్రి భువనగిరి, నేటిదాత్రి
చౌటుప్పల్:
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్ పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ వేణు రెడ్డి రాజు జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. తేదీ 17 9 2024 నుండి 02 10 2024 వరకు స్వచ్ఛత సేవ కార్యక్రమం కలదు. ఇట్టి స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఈరోజు చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యాలయంలో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయడం జరిగింది మరియు మున్సిపల్ కార్యాలయం నుండి బస్ స్టాప్ వరకు మరియు బస్ స్టాప్ నుండి తంగేడి పల్లి రోడ్డు మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు మానవహారం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామిలై కార్యక్రమం విజయవంతం చేయవలెనని గౌరవ చైర్పర్సన్ కోరడం జరిగింది .ఈ కార్యక్రమంలో చైర్ పర్సను వేణు రెడ్డి రాజు,మున్సిపల్ కమిషనర్ శ్రీ కే నర్సింహారెడ్డి , వైస్ చైర్మన్ బి శ్రీశైలం, కౌన్సిలర్లు బత్తుల రాజ్యలక్ష్మి, కొయ్యడ సైదులు , బొడికి అరుణగ, తాడూరి శిరీష , సంద గళ్ళవిజయ, కామిశెట్టి శైలజ ,ఎండి బాబా షరీఫ్, రాములు మేనేజర్ ,శ్రీ పి లింగయ్య మరియు మున్సిపల్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.