
చెన్నూరు, (మంచిర్యాల) నేటి ధాత్రి:
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నూర్ పట్టణ బీజేపీ కార్యాలయం (15వ వార్డు) వద్ద పట్టణ బీజేపీ అధ్యక్షుడు జాడి తిరుపతి అధ్యక్షతన జాతీయ జెండ ఎగరవేయడం జరిగినది.అదే విధంగా ఈ రోజు మన దేశ ప్రధాని అయిన శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టిన రోజు సందర్భంగా చెన్నూర్ పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న రోగులకు చెన్నూర్ పట్టణ బీజేపీ నాయకులు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం అనంతరం పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ఎందరో తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం వల్ల ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని చెప్పడం జరిగింది. ఇటువంటి రోజును భారత ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం గా జరుపుకోవాలని అదేశించగా ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు పట్టించే విధంగా ఈ రోజును తెలంగాణ విమోచన దినోత్సవం బదులుగా ప్రజాపాలన దినోత్సవంగా పేరు మార్చి వేడుకలు నిర్వహించడం సరికాదు అని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు రాపర్తి వెంకన్న,జిల్లా చేరికల కమిటీ సభ్యులు చెన్నూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, చెన్నూర్ పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శులు గర్రేపల్లి వెంకట నర్సయ్య,తుమ్మ శ్రీపాల్, రెండవ వార్డు కౌన్సిలర్ కమ్మల శ్రీనివాస్, కో ఆప్షన్ మెంబర్ కె వి ఎం శ్రీనివాస్,పట్టణ ఇన్చార్జి రత్న లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఓబీసీ మోర్చ కార్యవర్గ సభ్యులు కొండపాక చారి,జిల్లా ఎస్సీ మోర్చ ఉపాధ్యక్షులు తలారి రాజులు,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివ క్రిష్ణ, పట్టణ బీజేపీ నాయకులు కాయిత రాజేష్, వంశి, మద్ధ మధు,అడప శ్రీనివాస్,జనార్ధన్, రాజబాపు,గణేష్ సింగ్, ,కాయిత్ వెంకటేష్,సుంకరి శ్రావణ్, శ్రీకాంత్ ,సాయి తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.