
Telangana Formation Day
వేములపల్లిలో తెలంగాణ అవతరణ దినోత్సవము వేడుకలు అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం …
గ్రామ శాఖ అధ్యక్షులు ఆరేళ్ల రమేష్
మొగుళ్ళపల్లి నేటిధాత్రి:
భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని వేములపల్లి బి ఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఆరేళ్ల రమేష్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో జెండా ఆవిష్కరణ జరిపారు గ్రామ శాఖ అధ్యక్షులు మాట్లాడుతూ అమరవీరుల త్యాగ ఫలితం తోనే తెలంగాణ రాష్ట్రం కల సహకారం అయిందని, నీళ్లు, నిధులు, నియామకాలతో మొదలెట్టిన తెలంగాణ ఉద్యమం, సకలజనులు సబ్బండవర్ణాల కలయికతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. దశాబ్దాలుగా 1969 నుండి 2014 వరకు వివిధ దశలో సాగిన తెలంగాణ ఉద్యమంలో వేలాదిమంది ఆత్మహత్య చేసుకున్నారుప్రత్యేక తెలంగాణ అంశంపై 2017 శ్రీకృష్ణ కమిటీ ఎప్పటి ఆరు ప్రతిపాదనలు చేసి ఆ ప్రతిపాదనలు జూలై 2013 జూలై 31 తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది 2013 అక్టోబర్ 3న కేంద్రం మండలి ఆమోదం లభించగా 2014 ఫిబ్రవరి 13 తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతు లోకసభలో ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొంది 2014లో ఉమ్మడి రాష్ట్ర విభజన ఆదేశిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వికరణ చట్టం 2014 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు లేదా తెలంగాణ బిల్లు అని ప్రవేశపెట్టింది 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించాక 2014 దేశంలో 29వ రాష్ట్రంగా నూతన రాష్ట్రంగా ఆవిర్భవించింది . తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అని 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటంలో తెలంగాణ సాధించారని ఉద్యమ సారధి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించింది అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి పోచంపల్లి రమేష్ ఎండి రహీం బండారి తిరుపతి బీసీ సంఘం అధ్యక్షులు భాష బోయిన శ్రీశైలం వికలాంగుల అధ్యక్షులు రమేష్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు