
నెక్కొండ, నేటి ధాత్రి:
వరంగల్ జిల్లా డిసిసిబి చైర్మన్ మార్నింగ్ రవీందర్రావు ఆదేశాల మేరకు నెక్కొండ డిసిసిబి బ్యాంకులో శుక్రవారం ఏజీఎం పి కృష్ణమోహన్ బ్యాంకు సిబ్బంది మరియు పిఎసిఎస్ కార్యదర్శి తో రివ్యూ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది డిపాజిట్ పథకం ప్రవేశపెట్టామని ఇందుకు గాను 8.10% అత్యధిక వడ్డీ చెల్లించనున్నామని ఎందుకోసం బ్యాంకు సిబ్బంది పిఎసిఎస్ కార్యదర్శులు డిపాజిట్లు విధివిగా సేకరించాలని, ఆయన అన్నారు అలాగే రుణమాఫీ కోసం అర్హులైన రైతులు ఆన్లైన్లో ఆధార్ కార్డు నమోదు చేసుకోవాలని సకాలంలో రుణాలు చెల్లించాలని రైతులకు నూతనంగా సౌకర్యం కల్పించాలని బ్యాంకులో డిపాజిట్లను పెంచాలని అంశంపై ఈ రివ్యూ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది నెక్కొండ డిసిసిబి బ్యాంక్ మేనేజర్ ఎం రజిత ఈ తిరుపతి బ్యాంకు సూపర్వైజర్ జి నితిన్ , సహకార సంఘాల కార్యదర్శులు నెక్కొండ కార్యదర్శి మొడెం సురేష్, సూరిపల్లి కె వీరస్వామి, రెడ్లవాడ ఎం జనార్దన్, అమినాబాద్ పి రమేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .