
Telangana’s Dancing Peacock — Akira Janu
తెలంగాణ నాట్య మయూరి..కూచిపూడి నర్తకి అకిరా జాను
మంచిర్యాల,నేటి ధాత్రి:
తెలంగాణ మంచిర్యాల జిల్లా కు చెందిన అకీరా జాను చిన్న వయసులోనే దేశవ్యాప్తంగా ప్రముఖమైన
కూచిపూడి నర్తకి గా గుర్తింపు పొందింది.అకీరా తన నాట్య ప్రయాణాన్ని చిన్నతనంలోనే ఏడవ సంవత్సరంలో ప్రారంభించి,ఇప్పటివరకు సుమారు 100 కీ పైగా నృత్య ప్రదర్శన కార్యక్రమాలలో పాల్గొంది.కళా సంస్కృతి, సాంప్రదాయాల విలువల అభివృద్ధికి కృషిచేస్తూ,వివిధ సంస్కృతిక కార్యక్రమాలలో తన ప్రతిభను ప్రదర్శిస్తుంది.ప్రఖ్యాత గురువుల నుంచి శిక్షణ పొంది,శాస్త్రీయ నాట్యంలో విశిష్టమైన తనదైన శైలితో కళకు జీవం పోస్తుంది.బాల్యంలో నుండే అకీరా పలు ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థల పురస్కారాలు,ప్రశంస పత్రాలు అందుకుంది.తెలంగాణ రాష్ట్రస్థాయిలో ఉత్తమ కూచిపూడి నృత్య ప్రదర్శన కళాకారిణిగా గుర్తింపు పొందింది.రాష్ట్రీయ బాల పురస్కార్ కోసం ఆమెను నామినేట్ చేయడం ఈ ప్రాంత యువతకు స్ఫూర్తిదాయకం.అనేక పత్రికలు అకిరా నృత్య ప్రదర్శన పై ప్రత్యేక కథనాలు,శీర్షికలు ప్రచురించాయి.ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే భవిష్యత్లో మరిన్ని దేశ,విదేశీ వేదికలపై కూచిపూడి కళను ప్రదర్శించి భారతీయ కళా సంప్రదాయాన్ని ప్రపంచ దేశాలకు విస్తరింప చేయాలని,ఈ సంప్రదాయ నృత్యాన్ని మరింతగా గ్రామ స్థాయి యువతలోకి తీసుకెళ్లాలని అకీరా ఆకాంక్షిస్తుంది.