
గంగారం/కొత్తగూడ, నేటిధాత్రి
కొత్తగూడ :- తెలంగాణ వినియోగదారుల ఫోరం కొత్తగూడ మండల అధ్యక్షుడిగా మండలం లో ని ముష్మి గ్రామనికి చెందిన బానోత్ రవీందర్ ను నియమించినట్లు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ ఓ ప్రకటన లో తెలిపారు. ఈ సందర్బంగా బానోత్ రవీందర్ మాట్లాడుతూ…
వినియోగదారుడికి రోజు రోజుకి అన్యాయం జరుగుతుందని అన్నారు. విత్తనాలు, ఎరువులు, ఇంటి సామగ్రి, వంట సామగ్రి ఇలా అన్నిటిలోనూ వినియోగదారులకి జరుగుతున్న మోసాలను అరికట్టే విధంగా కృషి చేస్తానని తెలిపారు. మండల అధ్యక్షుడిగా నియమించిన జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారి కృతజ్ఞతలు తెలిపారు