*తెలంగాణ ఉద్యమకారుల మహాసభకు బయలుదేరిన ఉద్యమకారుల జేఏసి నాయకులు*
*పరకాల,నేటిధాత్రి*
తెలంగాణ ఉద్యమకారుల మహాసభకు పరకాల పట్టణంలో గల అమరధామం నుండి సూర్యాపేటకు తెలంగాణ ఉద్యమకారుల జేఏసి నాయకులు తరలి వెళ్లారు.ఈ సందర్బంగ మాజీ ఎంపీపీ రామ్మూర్తి,బొచ్చు కుమార్ తెలంగాణ ఉద్యమ నాయకులు మాట్లాడుతూ పోరాటం,ఆత్మగౌరవం,త్యాగాలకు మారుపేరు తెలంగాణ దోపిడి అణచివేతలకు వ్యతిరేకంగా మొక్కవోని ధైర్యంతో రాజీలేకుండా పోరాడుతున్న చరిత్ర అలాంటి చారిత్రక ప్రాంతం సూర్యపేటని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలకు కేంద్రంగా నిలిచి, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, స్వేచ్ఛ,సమానత్వాల కోసం నాటి పోరాటంలో అగ్రగామిగా నిలిచిందని సూర్యాపేట ప్రాంతంలోని కోటపాడు మిల్ట్రీ క్యాంప్‌పై దాడి నాటి మట్టి మనుషులు చేసిన పోరాట స్ఫూర్తి తదనంతరం తొలి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిందన్నారు.

ముల్కీ ఉద్యమంతో మొదలైన 1967- 68 నాటి తొలిదశ ఉద్యమంలో 370 మంది1993 నుండి సాగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది బలిదానాలు,లక్షలాది మంది ప్రజలు,విద్యార్థులు, నిరుద్యోగులు,మహిళల త్యాగాలతో 10 జిల్లాలతో కూడిన భౌగోళిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రాష్ట్రం ఆవిర్భవించి 12 ఏళ్లు గడిచిందని అన్నారు.అయితే బూటకపు వాగ్దానాలు చేసి రెండు పార్టీలు మూడు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయని ఈనగాసిన చేను నక్కల పాలైనట్లుంది నేడు తెలంగాణ పరిస్థితి ప్రత్యేక రాష్ట్ర కోసం పోరాడిన ఉద్యమకారుల కుటుంబాలు, వ్యక్తులు సర్వం కోల్పోయారన్నారు.కేసుల భారం మోయలేకపోతున్నారు. ఉద్యోగాలు,ఉపాధి అవకాశాలు లేవని క్షణక్షణం బ్రతకడం కోసం పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ జర్నలిస్టుల పురం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పరకాల,నడి కూడా మండల అధ్యక్షులు మడికొండ పవన్,చుక్క సతీష్,దూడపాక రమేష్,మేకల వినయ్,చుక్క ప్రభాస్ పాల్గొన్నారు.
