
మంగపేట నేటిధాత్రి
మేడారం జాతర సందర్భంగా మంగపేట మండల ప్రజల సౌకర్యార్థం మణుగూరు ఆర్ టి సి డిపో వారు మంగపేట మండల కేంద్రము లో గల రైతువేదిక వద్ద తాత్కాలిక బస్ స్టాప్ ఏర్పాటు చేసి ఈ నెల 18 నుండి జాతర పూర్తి అయ్యేవరకు మేడారంకు బస్సులు నడపనున్న సందర్భంగా మండల తహశీల్దార్ వీరాస్వామి రైతు వేదిక ను సందర్శించి ప్రయాణికుల సౌకర్యార్థం చేయవలసిన ఏర్పాట్ల పై మంగపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి కి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీ చేరాలు , పంచాయతీ కార్యదర్శి సురేష్, రెవిన్యూ సిబ్బంది మరియు మణుగూరు ఆర్ టి సి డిపో సిబ్బంది పాల్గొన్నారు.