మీ సేవా కేంద్రాలు నిర్దేశించిన రుసుము కంటే అదనంగా తీసుకుంటే చర్యలు
తహసీల్దార్ శ్రీనివాస్ ఈడీఎం శ్రీకాంత్
భూపాలపల్లి నేటిధాత్రి
శనివారం భూపాలపల్లి మండల కేంద్రంలోని మీ సేవా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సేవల అందుబాటు, ప్రజలకు అందిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించారు.
ప్రజలు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే సంబంధిత అధికారులను సంప్రదించాలని, ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని నిర్వాహకులకు సూచించారు. ప్రజలకు అంతరాయం లేకుండా సేవలు అందించాలని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలందించడమే మీ సేవా కేంద్రాల కర్తవ్యం తెలిపారు. మీ సేవా కేంద్రాల ద్వారా అందించు సేవలకు సంబంధించి ధరల పట్టిక ఏర్పాటు చేయాలని మీ సేవా కేంద్రం నిర్వహకులను ఆదేశించారు.