Tahsildar Iqbal Inspects Flood-Affected Areas
ఖిలావరంగల్లో తహసీల్దార్ ఇక్బాల్ పర్యటన – వర్షంలో ప్రజల బాగోగులపై ఆరా…
నేటిధాత్రి, వరంగల్.
ఖిలావరంగల్ మండల తహసీల్దార్ ఇక్బాల్ కుండపోత వర్షంలో బుధవారం లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. వరద ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో సమస్యలను స్వయంగా పరిశీలించి, ప్రజలతో మాట్లాడి వారి స్థితిగతులను తెలుసుకున్నారు.
ప్రజలకు ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడే బయటకు రావాలని సూచించిన ఇక్బాల్, ప్రభుత్వం మరియు అధికారులు ప్రజలకు అండగా ఉన్నారని తెలిపారు. వాగులు, చెరువులు, లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తూ సిబ్బందికి తగిన సూచనలు అందించారు.

ఈ పర్యటనలో ఆర్ఐ కీర్తన్, జూనియర్ అసిస్టెంట్లు వంశీ, శివ, జిపిఓ సుభాష్ పాల్గొని ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు.
