ప్రజాసేవ ధ్యేయంగా దూసు కుపోతున్న తీన్మార్జయ్.

Public service.

ప్రజాసేవ ధ్యేయంగా దూసు కుపోతున్న తీన్మార్ జయ్

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం సూర్య నాయక్ తండా గ్రామంలో రెండు రోజుల క్రితం గాలి దుమారం వల్ల గ్రామంలో మక్కా జొన్న పంట నేలకు వాలడంతో గ్రామంలో రైతులకు జరిగినటువంటి నష్టాన్ని తెలుసుకున్న తీన్మార్ జయ్ సమస్యను మండల వ్యవసాయ శాఖ అధికారు లకు వివరించి రైతులకు అధికారుల నుండి న్యాయం జరిగేలా కృషి చేశాడు తమ ఓటు వేసి గెలిపించుకున్న నాయకులు చేయవలసిన పని మంచి మనసుతో తమ గ్రామం లోని తీన్మార్ జయ్ రైతుల పక్షాన నిలవడం చాలా సంతోషంగా ఉందని రైతులు ప్రశంసించారు తండా గ్రామం లో 42 మందికి ఉచిత కంటి ఆపరేషన్ తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో చేయించి వారి మన్ననలను పొందాడు తన గ్రామంలో వారం అంగడి స్థాపించి చుట్టుపక్కల గ్రామా లకు కూడా తను ఒక ఆదర్శ వంతమైన వ్యక్తిగా నిలిచాడు అలాగే ఫ్లోరైడ్ నీటి వాటర్ ఉండకూడదని ఆ తండా గ్రామంలో ప్రతి ఒక్కరికి మినరల్ వాటర్ ఉచితంగా సరఫరా చేయాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ను కొంతమంది దాతల సహాయంతో కలిసి నిర్మిస్తున్నాడు తన పుట్టిన ఊరు తన కన్న తల్లితో సమాన మని తన గ్రామ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచు కోవడం లేనే నాకు ఆనందంగా ఉంది అని ఎవరో వస్తారు ఏమో చేస్తారు అని ఎదురు చూడటం చేతగాని తనం అవు తుందని అన్నారు రానున్న స్థానిక సంస్థల్లో ఆ సూర్య నాయక్ తండా గ్రామంలో తాను తప్పకుండా పోటీలో నిలిచి తన గ్రామాన్ని ఆదర్శ గ్రామం గా తీర్చిదిద్దాలని తీన్మార్ జయ్ అన్నారు. గ్రామంలోని ప్రజలు తీన్మార్ జయ్ చేస్తున్న మంచి పను లకు ఎప్పుడు తనకు అండగా ఉంటామని ప్రజలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!