
GHMC mosquito control
సాంకేతికదన్నుగా….దోమలపై జీహెచ్ఎంసీ యంత్రాంగం సమరభేరి
– ముమ్మరంగా యాంటి లార్వా ఆపరేషన్లు
– మానవ జోక్యం లేని ప్రదేశాలలోనూ డ్రోన్ లతో స్ప్రేయింగ్
హైదరాబాద్, నేటిధాత్రి:
సాంకేతికతదన్నుగా దోమల నివారణకు జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. తద్వారా గ్రేటర్ హైదరాబాద్ లో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి కేసులను తగ్గించేందుకు,వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తుంది.
కమిషనర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం అన్ని జోన్లు, సర్కిల్ ల పరిధిలో యాంటి లార్వా , యాంటి అడల్ట్ మాస్కిటో కార్యక్రమాలు అమలు చేస్తుంది.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గుర్తించిన 4846 కాలనీల్లో నీటి నిల్వ ప్రదేశాలు, చెరువులు, బాబులు, కుంటల్లో గాంబుసియా చేపలు, ఆయిల్ బాల్స్ విడుదల చేస్తూ దోమల వృద్ధి జరగకుండా చూస్తున్నారు.
ఒక్కొక్క వార్డుకు ఒక ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం కాగా, ఏఎల్ఓ ఆపరేషన్లు, ఫాగింగ్, ఐఈసీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
లోతట్టు ప్రాంతాలు , సెల్లార్లు, నిర్మాణ క్షేత్రాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తూ ఇండోర్ పైరిథ్రమ్ స్పేస్ స్ప్రే, లార్వల్ సర్వేలు చేపడుతున్నారు. ఒక్కో జోన్ కు ఒక్కో ఫ్లోట్ ట్రాష్ కలెక్టర్ల ద్వారా గుర్రపు డెక్కలను, కుళ్ళిన మొక్కల వ్యర్థాలను తొలగిస్తూ దోమలు వృద్ధి చెందకుండా చూస్తుంది. మానవ జోక్యం లేని ప్రదేశాలలోనూ డ్రోన్ లతో స్ప్రేయింగ్ దోమలను అరికట్టేందుకు జీహెచ్ఎంసీ అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుంటుంది. డ్రోన్లను ఉపయోగించి స్ప్రేయింగ్ను నీటి ట్యాంకుల్లోనే కాకుండా, మానవ జోక్యం లేని ప్రదేశాలలో చేపడుతూ… దోమల బెడద లేకుండా చేస్తుంది.
ప్రతి మంగళవారం, శుక్రవారం, శనివారం క్రమం తప్పకుండా నగర పరిధిలో అన్ని పాఠశాలలు, కళాశాలల్లో చేపడుతూ విద్యార్థులను చైతన్యం చేస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పేరిట కాలనీల లో ఐ ఈ సి కార్యకలాపాలను చేపడుతుంది. అలాగే జీహెచ్ఎంసీ యాప్, ఈ-మెయిల్స్, ట్విట్టర్ ద్వారా పౌరుల ఫిర్యాదులను పరిష్కరిస్తున్నారు. నగర ప్రజలు తమ ఇంటితో పాటు పరిసరాలలో నీరు నిల్వకుండా చూడడం ద్వారా డెంగ్యూ , మలేరియా , చికెన్ గున్యా నివారణకు ప్రజలు సహకారం అందించాలని కోరుతున్నారు.
ఆన్లైన్ విజ్ఞప్తుల ఆధారంగా ఫాగింగ్
జీహెచ్ఎంసీ, తమ యాప్ ద్వారా ఫాగింగ్ కోసం అభ్యర్థనలను స్వీకరిస్తోంది. ప్రజలు తమ ప్రాంతాల్లో ఫాగింగ్ అవసరమని భావిస్తే, %వీవ Gనవీజ% యాప్ ద్వారా విజ్ఞప్తి చేసుకున్న వెంటనే ఫాగింగ్ చేపడుతూ దోమలను అరికడుతుంది.
టెక్నాలజీ దన్నుగా లార్వా ఆపరేషన్ల పర్యవేక్షణ
లార్వా వ్యతిరేక కార్యకలాపాలను జియో-ట్యాగ్ చేయబడిన ట్రాకింగ్ ద్వారా ప్రభావవంతంగా చేపడుతున్నారు.
జియో-ట్యాగ్ చేయబడిన ఫోటోల ఆధారంగా మానిటరింగ్ చేస్తున్నారు.
ఫలితంగా క్షేత్ర సిబ్బంది లో జవాబుదారీతనం పెంచుతుంది.
ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం, ప్రజల సహకారంతో గ్రేటర్ హైదరాబాద్ లో చేపడుతున్న కార్యక్రమాలు చాలా వరకూ ప్రజలు డెంగ్యూ,మలేరియా, చికెన్ గున్యా బారిన పడకుండా చూస్తున్నాయి.