ఇంకో రెండు గంటల్లో పెళ్లి.. ప్రియుడిని కలిసిన యువతి..

ఇంకో రెండు గంటల్లో పెళ్లి.. ప్రియుడిని కలిసిన యువతి..

 

ఓ యువతి పెళ్లికి రెండు గంటల ముందు తన ప్రియుడ్ని కలవడానికి వెళ్లింది. చివరిసారిగా తన ప్రియుడితో మనస్పూర్తిగా మాట్లాడింది. అతడిని హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.

ప్రేమించుకున్న వారందరూ పెళ్లి చేసుకుంటారన్న గ్యారెంటీ లేదు. చాలా కేసుల్లో జంటలోని ఎవరో ఒకరికి ఎదుటి వ్యక్తిపై ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. బ్రేకప్ చెప్పేసి వెళ్లిపోతారు. కొన్ని కేసుల్లో ఇంట్లో వాళ్ల కారణంగా వేరే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇంట్లో వాళ్ల ఒత్తిడి వల్ల వేరే పెళ్లి చేసుకున్న వారిలో చాలా మందికి తమ లవర్స్‌పై ప్రేమ చావదు. పెళ్లి తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుంది. తాజాగా జరిగిన ఓ సంఘటన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ఓ యువతి పెళ్లికి రెండు గంటల ముందు తన ప్రియుడ్ని కలవడానికి వెళ్లింది. చివరిసారిగా తన ప్రియుడితో మనస్పూర్తిగా మాట్లాడింది.

అతడిని హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ యువతి పెళ్లి బట్టల్లో కారులో కూర్చుని ఉంది. ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంది. కొద్దిసేపటి తర్వాత కారు ఓ చోట ఆగింది. ఆ పెళ్లి కూతురు కిందకు దిగింది. పరిగెత్తుకుంటూ చీకట్లో నిలబడ్డ ఓ వ్యక్తి దగ్గరకు వెళ్లింది. గొడవపడుతున్నట్లు ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. తర్వాత యువతి అక్కడినుంచి కారు దగ్గరకు వచ్చేసింది. ఆమె కూర్చోగానే కారు ముందుకు కదిలింది. ఆ కొత్త పెళ్లి కూతురు కారులో కూర్చుని ఏడవసాగింది.ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘పెళ్లికి ముందు ప్రియుడ్ని కలుస్తావా? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు. నీలాంటి వారిని ఊరికే వదిలేయకూడదు’..‘వీడియో పబ్లిక్ చేశారు కదరా?.. పెళ్లి కొడుకు కుటుంబం పరిస్థితి ఏంటి?’.. ‘ఇది నిజంగా జరిగిన సంఘటనలా అనిపించటం లేదు. అంతా స్క్రిప్ట్‌లాగా ఉంది’..‘పెళ్లి తర్వాత ఆ భర్త పరిస్థితి ఏంటో ఆ దేవుడికే తెలియాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version