మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలోని చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా నేను ఎలాంటి మత్తు పదార్థములను
ఉపయోగించను మరియు వాటి అమ్మకం రవాణా మరియు తదితర కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా గాని పరోక్షంగాకానీ పాలు పంచుకొను నేను పై విషయంలో నా తోటి విద్యార్థులు ఆరోగ్య కరమైన జీవితం గడిపేందుకు నా వంతు కృషి చేస్తాను. ఇంటర్నెట్ మధ్యమాన్ని వ్యక్తిగత మరియు సామాజిక వికాసానికి ఉపయోగిస్తాను.నేను నా తోటి విద్యార్థులను ఎలాంటి హింసకు గురి చేయను.ప్రతి ఒక్కరి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తాను.పిల్లలపై లైంగిక వేధింపులు నేరం అని భావిస్తున్నాను.నేను ఇలాంటి విషయాల పట్ల ఎల్లప్పుడు బాధ్యతగా వ్యవహరిస్తానని నా కుటుంబం పాఠశాల సమాజం తెలంగాణ రాష్ట్రం నా మాతృభూమి భారతదేశం గర్వించేల ఉంటానని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణదేవి ఉపాధ్యాయులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, బోయ మల్లేష్,కె.వెంకటయ్య,కె.సికిందర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.