Teachers Demand TET Exemption in Medchal District
టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :
సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సంపూర్ణ మద్దతుగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జాతీయ పెన్షన్ పథకం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని, పాఠశాలల విలీనం, మూసివేతను వ్యతిరేకించడం జరిగిందాన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తూముకుంట ఉపాధ్యాయులు, లాల్ గడి మలక్ పేట్ ఉపాధ్యాయులు తో పాటు వివిధ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ షామీర్పేట్ మండల అధ్యక్షులు పి తిరుమలేష్, ప్రధాన కార్యదర్శి యు కుమార్, జిల్లా పరిషత్ హై స్కూల్ తూముకుంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి, లాల్ గాడి మలక్ పేట్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస ప్రభాకర్, పిఈటీఏ టీఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీ సత్తిరెడ్డి, ఉపాధ్యాయులు అన్నపూర్ణ, నాగ శారద, శ్రీనివాస్ రెడ్డి, వనజ, రజిని, వరలక్ష్మి, పద్మ , శ్రీదేవి, మహేష్ భాగ్యరేఖ పాల్గొన్నారు.
