రాంపురం గ్రామంలో వృధాగా పోతున్న మంచినీరు.
* మంచినీటి సరఫరాలో లోపించిన పర్యవేక్షణ
అనేక వార్డులలో వృధాగా పోతున్న మంచి నీరు,
మరిపెడ నేటిధాత్రి.
మంచినీరు వృధాగా పోతున్న అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరిపెడ మండల కేంద్రంలో ని రాంపురం గ్రామంలో అనేక వార్డులలో మంచినీరు వృధాగా పోతున్న కారణం గా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భగీరథ మంచినీరు సరఫరా అవుతున్నప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో హౌస్లలలో ట్యాప్ లు పెట్టకపోవడం వలన గ్రామపంచాయతీలో కొన్ని ప్రాంతాల్లో మంచినీరు వృధాగా పోతుండగా రోడ్ల పై నీరు నిలిచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని ప్రజలు వాపోతున్నారు, వానాకాలం కాబట్టి తొందర గా నీరు వృధా గా పోకుండా చూడాలని దోమలు ఈగలు స్వైర విహారం చేస్తున్న సందర్భంగా ప్రజలు ఆనారోగ్యనికి గురై తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు,రోడ్ల పై హెవీ వెహికిల్స్ పోవడం వల్ల పైపులైన్లు దెబ్బ తిని నీరు వృధాగా పోతుంది, రెండు, మూడు నెలలు గడుస్తున్నా నేటి వరకు రిపేరు చేయ లేదు. మరోపక్క ఆయా ప్రాంతంలో పట్టా పగలె వీదీ దీపాలు వెలుగుతున్నాయి, అధికారులు సిబ్బంది చూసినా పట్టించు కోవటం లేదని పలువురు ఆరోపిసున్నారు.
ఒక దగ్గర అతివృష్టి మరో ప్రాంతంలో అనావృష్టి అన్న చందంగా పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు, ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకొని పైపులు లైన్ రిపేరు చేయాలని వృథాగా పోతున్న మంచినీటిని కట్టడి చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఇన్చార్జి పాలన ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీ లో ఎక్కడి సమస్య అక్కడే ఉంటుందని ప్రజలు ఆరోపిస్తున్నారు,సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు పేర్కొంటున్నారు.పైపు లైను లీకెజీ కాకుండా తగు చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.