Teachers’ Pending Issues Submitted to MLA
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించిన తపస్ నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్ )భూపాలపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు,ఉద్యోగులు పెన్షనర్స్ ఎదుర్కొంటున్న పలు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంఘ నాయకులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పి ఆర్ సి కమిటీ రిపోర్టు ను ప్రభుత్వం తెప్పించుకొని పి ఆర్ సి నీ వెంటనే ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, ఇతర పెండింగ్ బకాయిలన్నింటిని త్వరితగతిన ఉపాధ్యాయులకు చెల్లించాలని ఎమ్మెల్యే ను సంఘ నాయకులు కోరారు.
ఉపాధ్యాయులకు,ఉద్యోగులకు , విశ్రాంత ఉద్యోగులకు రావలసిన బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు. అదేవిధంగా మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ హామీలను నెరవేర్చాలని కోరారు.
రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నింటిని ప్రస్తావించి వాటి పరిష్కారం కొరకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొనే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరుతూ వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షులు ములుకల్ల తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి వెంకట్రాంరెడ్డి, రాష్ట్ర బాధ్యులు మారబోయిన మహేందర్, సంగెం శ్రీనివాస్, రేగొండ డివిజన్ ఇంచార్జి కొడకండ్ల శ్రీకాంత్, చిట్యాల మండల ప్రధాన కార్యదర్శి లకుం రంజిత్ కుమార్, మహాదేవపూర్ మండల అధ్యక్షులు నస్పూరీ సంతోష్ కుమార్,జిల్లా కార్యదర్శిలు గౌరిశెట్టి రవీంద్రనాథ్, మూడికె శ్రీనివాస్, జంగిలి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
