శాసనమండలి ఎన్నికలలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర

ఆర్ టి యు టిఎస్ జిల్లా అధ్యక్షులు సుభాకర్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

నల్గొండ ,ఖమ్మం ,వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొని ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే బాధ్యత తీసుకోవాలని పి ఆర్ టి యు టిఎస్ జిల్లా అధ్యక్షులు రేగూరి సుభాకర్ రెడ్డి అన్నారు .ఫిబ్రవరి 6తో గడువు ముగియనున్న ఓటర్ నమోదు ప్రక్రియలో ఉపాధ్యాయులందరూ మరియు వారి కుటుంబ సభ్యులు ఓటరుగా నమోదు చేసుకొని రాబోయే శాసనమండలి ఎన్నికలలో కీలక పాత్ర పోషించాలని తద్వారా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలకు మార్గం సుగుమ0 చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో రాజ్యాంగం ఓటు అనే ఆయుధం ద్వారా మన సమస్యలను పరిష్కరించుకోవచ్చని సమస్య తీవ్రతను వ్యక్తపరచడానికి బ్యాలెట్ విధానమే సరైనదని ఆ ప్రక్రియలో సమాజానికి ఉపాధ్యాయులు దిక్సూచిగా ఉండి 2020 నవంబర్ వరకు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఉపాధ్యాయులు వారి కుటుంబ సభ్యులు పెన్షనర్లువారందరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదయ్యేలాగా చైతన్య పరిచాలని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ ఫోరం బాధ్యులు పోతర్ల సతీష్ గుగులోత్ రాంధన్ ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *